»   » కూతురు జాయినైతే అభ్యంతరం లేదంటున్న స్టార్‌హీరో

కూతురు జాయినైతే అభ్యంతరం లేదంటున్న స్టార్‌హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Saif Ali Khan about his daughter
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన కూతురు సారా బాలీవుడ్లో జాయిన్ అయితే ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. అయితే అంతకు ముందే ఆమె చదువులు పూర్తవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. 1991లో సైఫ్ అలీ ఖాన్ నటి అమృతా సింగ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి కూతురు సారాతో పాటు ఓ కొడుకు జన్మించాడు. పదమూడేళ్ల కాపురం అనంతరం 2004లో ఈ జంట విడిపోయారు.

ఆ మధ్య తల్లి అమృతా సింగ్‌తో కలిసి సారా ఓ మేగజైన కవర్ పేజీపై దర్శనం ఇవ్వడంతో పాటు ప్రముఖ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాలు రూపొందిన డిజైన్లతో ర్యాంప్ షోలలో కూడా పాల్గొంది. అప్పటి నుంచి సారాపై మీడియా ఫోకస్ ఎక్కువైంది. ఆమె త్వరలో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతోందంటూ ప్రచారం కూడా మొదలైంది.

కొందరు ఫిల్మ్ మేకర్స్ ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి రెడీగా ఉండటంతో పాటు, పలు ఆసక్తికర కథలతో సంప్రదింపులు జరుపుకున్నారని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం సారా అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో చదువుకుంటోంది. సినిమాల్లోకి రావడం, రాక పోవడం సారా ఇష్టమని...ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని సైఫ్ వెల్లడించారు.

సినిమాల్లోకి వస్తే తప్పకుండా తన మద్దతు ఉంటుందని...నిర్మాత, నటుడు అయిన సైఫ్ అలీ ఖాన్ స్వయంగా వెల్లడించడం చర్చనీయాంశం అయింది. అయితే హీరోయిన్ కావాలంటే సారా కాస్త బరువు తగ్గాలని సైఫ్ అభిప్రాయ పడుతున్నారు.

'ఒక వేళ సారా సినిమా ఇండస్ట్రీని ఎంచుకుంటే, ఆమె తప్పకుండా బరువు తగ్గాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడప్పుడే కాకుండా చదువలు పూర్తయిత తర్వాత వస్తే బాగుంటుంది. ఒక వేళ సినిమాల్లో సక్సెస్ కాక పోతే ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. చదువు పూర్తయితే ఏదో ఒక రంగంలో రాణించడానికి వీలుంటుంది. అందుకే సినిమాల్లోకి రావడానికి ముందే చదువులు పూర్తయితే మంచిదని నా భావన' అని సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు.

తన కూతురు తనకు మంచి స్నేహితురాలని, అదే సమయంలో ఆమె నా బలహీనత అని సైఫ్ అలీ కాన్ వెల్లడించడం గమనార్హం. దీన్ని బట్టి కూతురుపై సైఫ్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.

English summary
Actor Saif Ali Khan says he has no objection if his daughter Sara joins the film industry, provided she completes her education. Saif married actress Amrita Singh in 1991 and they have two children - daughter Sara and a son. After thirteen years of marriage the couple divorced in 2004.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu