బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ రోజు(శుక్రవారం)ముంబయిలోని లీలావతి హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. అతను రాత్రి నుండి కడుపులో నొప్పితో బాధపడుతూండటంతో ఇంట్లో వాళ్ళు డాక్టర్ కి చూపెట్టాలని హాస్పటిల్ కి తీసుకెళ్లగా వారు ఎడ్మిట్ చేసుకుని టెస్ట్ లు చేస్తున్నారు. ఇక ముప్ఫై ఎనిమిదేళ్ళ సైఫ్ గతంలో ఎపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్నారు. అలాగే క్రింతం సంవత్సరం చెస్ట్ లో పెయిన్ తో హాస్పటిల్ పాలయ్యారు. ఇప్పుడు ఇలా జరగటంతో బాలీవుడ్ వర్గాలు పలకరింపులకు హాస్పటిల్ వద్ద క్యూ కట్టారు. అయితే డాక్టర్స్ మాత్రం కంగారుపడాల్సిందేమీ లేదని టెస్ట్ లు పూర్తి చేసి ఓ నిర్ణయానికి వస్తామని,ప్రస్తుతం తాత్కాలికంగా నొప్పి తగ్గటానికి ట్రీట్ మెంట్ ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుతం సైప్ తన గర్ల్ ప్రెండ్ కరీనా కపూర్ తో కలసి ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. యుఎస్ లో షెడ్యూలు ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ తన హోమ్ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. టెర్రరిజం బేస్ గా ఈ సబ్జెక్టు సాగుతుందని సమాచారం.