దాడి కేసు: స్టార్ హీరోపై చార్జ్ షీట్ దాఖలు
హైదరాబాద్: ఇటీవలే తన ప్రియురాలు, సెక్సీ హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లాడిన సైఫ్ అలీ ఖాన్ ఆ ఆనందం నుంచి బయట పడక ముందే...... ఓ కేసుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. తాజ్ హోటల్‌లో దాడి కేసుకు సంబంధించి ముంబై పోలీసులు సైఫ్ అలీ ఖాన్ పై చార్జ్ షీట్ దాఖలు చేసారు. ముంబై నుంచి అందిన వివరాల ప్రకారం...ఇడియన్ పీనల్ కోడ్ సెక్షన్ 325, సెక్షన్ 34 ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
జరిగింది ఇదీ...
ఈ సంవత్సరం ఫిబ్రవరి 21న తాజ్ హోటల్ కు వచ్చిన సైఫ్..ఇక్భాల్ శర్మ అనే వ్యక్తిపై దాడి చేశాడు. పిడిగుద్దులతో అతని ముఖంపై గాయం చేశాడు. దీంతో శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైఫ్ తాడి ఉండటం వల్లనే ఇలా దాడి చేసారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అప్పుడు పోలీసులు సైఫ్‌ను అరెస్టు చేసారు కూడా. అయితే వెంటనే రూ. 3000 చెల్లించి బెయిల్ పై విడుదలయ్యారు.
తొలుత తనపైనే దాడి జరిగిందని, తనను తాను కాపాడుకున్నానని సైఫ్ అలీఖాన్ మీడయాకు వెల్లడించారు. తన బృందంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తనను కొట్టారని ఆరోపించారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని, రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలు అన్నింటినీ రుజువు చేస్తాయని సైఫ్ అప్పుడు చెప్పుకొచ్చారు.
అప్పటి నుంచి ఎలాంటి సమస్య లేకుండా తిరుగుతున్న సైఫ్ పై తాజాగా చార్జ్ షీట్ దాఖలు కావడం చర్చనీయాంశం అయింది. సైఫ్ అలీఖాన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇప్పుడు కొత్తేమీ కాదు. 2008లో ఒకసారి ఇదే తరహాలో ఓ ఫోటో జర్నలిస్టుపై దాడి చేశాడు. అయితే అప్పట్లో సైఫ్ కు, ఫోటో గ్రాఫర్ కు మధ్య కొందరు రాజీ కుదర్చడంతో వివాదం సద్దుమనిగింది. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











