కొట్లాటకు దారితీసిన సైఫ్, దీపిక కాక్‌టెయిల్ పార్టీ
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, దీపిక పడుకొనే నటించిన 'కాక్‌టెయిల్' చిత్రం జులై 13న విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రం నిర్మాతలు సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబైలోని మినికూపర్ షోరూమ్‌లో గడిచిన వీకెండ్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీ కాస్తా మీడియాకు, బౌన్సర్స్(సెక్యూరిటీ గార్డులు)కు, మీడియాకు మధ్య కొట్లాటకు దారి తీసింది.
పార్టీ రాత్రి 9.30 గంటలకు అయితే సైఫ్, దీపిక, మరో హీరోయిన్ డయానా పెంటీ 11 గంటల తర్వాత హాజయ్యారు. అప్పటి వరకు వీరి రాక కోసం ఎదురు చూసిన వారంతా సైఫ్, దీపికలను చూడగానే వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగబడ్డారు. అదే సమయంలో మీడియాకు సంబంధించి ఫోటోగ్రాఫర్లు తమ విధినిర్వహణలో భాగంగా బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ తీయడానికి ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు. క్రౌడ్‌ను అరికట్టడం కోసం బౌన్సర్స్ అందరిని తోసేయడం మొదలు పెట్టారు. ఈ ఘటనలో పలువురు మీడియా పర్సన్స్‌కి గాయాలు కావడంతో పాటు కెమెరాలు డ్యామేజ్ అయ్యాయి. దీంతో మనస్థాపం చెందిన మీడియా ప్రతినిధులు ఆ ఈవెంట్‌ను కవర్ చేయకుండా వెళ్లి పోయారు.
రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందుతున్న కాక్ టెయిల్..జులై 13న విడుదలకు సిద్ధం అవుతోంది. హోమీ అదాజానియా దర్శకత్వం వహించిన ఈచిత్రం సైఫ్, ఇల్యుమినేటి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రీతమ్ సంగీతం అందించారు. దాదాపు రూ. 45 కోట్ల వ్యయంతో దీన్ని తెరకెక్కించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











