ఎయిర్ పోర్టు నుంచి టాప్ హీరోను గెంటేసిన సిబ్బంది!
అక్కడి నుంచి అందిన వార్తల ప్రకారం...లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్ పోర్టులో విఐపీ లాంజ్‌ను ఖాళీ చేయాల్సిందిగా సైఫ్ అలీ ఖాన్‌ను సెక్యూరిటీ సిబ్బంది కోరారు. అయితే సైఫ్ వారి మాట వినకుండా వారితో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఆయన్ను వీఐపీ లాంజ్ నుంచి గెంటేసారు. ఈ ఘర్షణ విమానాశ్రయం యొక్క సీనియర్ అధికారులు జోక్యంతో ముగిసింది.
విమానాశ్రయం అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడిస్తూ... సైఫ్ అలీ ఖాన్ బయటకు వెల్లడానికి నిరాకరించారు. అందుకే సిబ్బంది అతన్ని బలవంతంగా బయటకు పంపారు అని తెలిపారు. తన తాజా సినిమా 'బుల్లెట్ రాజా' చిత్రం షూటింగులో భాగంగా సైఫ్ అలీఖాన్ లక్నో వెళ్లారు. ఈ సందర్బంగా ఈ గొడవ చోటు చేసుకుంది.
సైఫ్ అలీ ఖాన్‌కు ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. అనేక సందర్భాల్లో ఆయన పబ్లిక్ ప్లేసుల్లో అనవసర గొడవలకు దిగి వార్తల్లోకి ఎక్కారు. గతంలో ఆయన ఎన్నారై ఇక్బాల్ శర్మ పై దాడి చేసిన కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. తన భార్య కరీనా కపూర్, మలైకా అరోరా, అమృత అరోరాతో కలిసి తాజ్ హోటల్ కు డిన్నర్ కు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.


Click it and Unblock the Notifications












