పవన్ కళ్యాణ్ నా చిత్రంలోనా..చాలా హ్యాపీ: సైఫ్ అలీఖాన్

By Sindhu

జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నటుడు గణేష్ నిర్మిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అనుష్క నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ 'లవ్ ఆజ్ కల్" చిత్రానికి రీమేక్.

బాలీవుడ్ లో ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునే లు జంటగా నటించారు. ప్రస్తుతం సైఫ్ హీరోగా తానే నిర్మిస్తున్న హింది చిత్రం 'ఏజెంట్ వినోద్"షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ చేరుకున్న సైఫ్ కి ఈ విషయం తెలియడంతో ఆయన చాలా సంతోషించాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు గతంలోనే తెలుసని ఆయనంటే నాకు కూడా ఎంతో ఇష్టమని నా చిత్రం ఆయన చేయడం చాలా సంతోషంగా ఉందని పవన్ కి ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆయన తన ఆనందాన్ని తెలియజేశాడు.

అన్నట్టు ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకునె ఓ పాత్ర చేయనుందని కూడా సమాచారం. దీపికా పదుకునె, జయంత్ కి మధ్య మంచి పరిచయాలు ఉండటంతో దీపికా ఇందులో నటించడానికి ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X