సైఫ్-కరీనా పెళ్లి రోజు పార్టీ, ఎలక్షన్ కమీషన్ నోటీసులు!

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, అతని తల్లి షర్మిలా ఠాగూర్‌లకు ఎలక్షన్ కమీషన్ నుండి నోటీసులు జారీ అయ్యాయి. గుర్‌గావ్ సమీపంలో సైఫ్ అలీ ఖాన్ తన వెడ్డింగ్ డే పార్టీ భారీగా జరుపుకోవడమే ఇందుకు కారణం. నిబంధనలు అతిక్రమించడంతో ఈసీ నోటీసులు జారీ చేసింది.

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పటౌడీ ప్యాలెస్‌లో ఈనెల 16వ తేదీన గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసారు. గుర్‌గావ్ సిటీకి 26 కిలోమీటర్ల దూరంలోని ప్యాలెస్‌లో ఈ పార్టీ జరిగింది. అక్టోబర్ 16 రాత్రి నుండి 17వ తేదీ తెల్లవారు ఝాము వరకు పార్టీ జరిగింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరయ్యారు.

Saif Ali Khan issued notice by Election Commission for loud party

వెడ్డింగ్ డే పార్టీ సందర్భంగా భారీ లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి మ్యూజిక్ ప్లే చేసారు. అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా....ఎలాంటి అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడిన నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ వీరికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోగా వివరణ ఇవ్వాల్సిందిగా సైఫ్ అలీ ఖాన్‌ను ఆదేశించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X