నేడు సైఫ్-కరీనా రిజిస్టర్ మ్యారేజ్...(లవ్వాయణం ఫోటోల్లో)
ముంబై: బాలీవుడ్ లవ్ బర్డ్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఎట్టకేలకు ఓ ఇంటివారు కాబోతున్నారు. నేడు ముంబై బాంద్రా రిజిస్టర్ ఆఫీసులో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందించింది.
బాలీవుడ్ సమాచారం ప్రకారం 17న పటౌడీలో ముస్లిం సంప్రదాయం ప్రకారం నిఖా జరుగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన వారు, స్నేహితులు హాజరు కానున్నరు. 18న ఢిల్లీలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. రిసెప్షన్ ఫంక్షన్‌కి పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు హాజరవనున్నారు.
సైఫ్- కరీనా లవ్వాయణం వివరాల్లోకి వెళితే...టషన్ చిత్రంతో కలిసి నటించినప్పటి నుంచి సైఫ్-కరీనా బంధం బల పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎఫైర్ రగిలింది. అప్పటి వరకు షాహిద్‌తో ప్రేమాయణం నడిపిన కరీనా అతన్ని వదిలేసి సైఫ్ ప్రేమకు దాసోహం అయింది. అదే విధంగా మొదటి భార్యతో విడాకుల తర్వాత ఒంటరి జీవితం గడుపుతున్న సైఫ్‌కు కరీనాను తన జీవితంలోకి ఎంతో సాదరంగా ఆహ్వానించాడు.

సైఫ్-కరీనా టషన్ చిత్రంలో తొలి సారిగా కలిసి హీరో హీరోయిన్లుగా నటించారని అనుకుంటున్నారంతా. కానీ వారు 2003లోనే జె.పి దత్తా దర్శకత్వంలో వచ్చిన ‘లాక్ కార్గిల్' చిత్రంలో కలిసి నటించారు.

సైఫ్, కరీనా టషన్ చిత్రంలో కలిసి నటించినప్పుడు ఇద్దరు మనసులు కలిసాయి. అందుకే ఈ సినిమాలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు బాగా పండాయని అంటుంటారు.

సైఫ్ అలీఖాన్ తొలి సారిగా 2007లో జరిగిన మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ షోలో కరీనాతో డేటింగ్ చేస్తున్న విషయం బయట పెట్టాడు.

కరీనాపై తనకున్న ప్రేమను చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుని అందరికీ తెలిసేలా చేసాడు సైఫ్. ఈ విషయంతో ఇద్దరి మధ్య ‘సం'బంధం ఉందనే విషయం ఖరారైంది.

ఒకసారి సైఫ్... కరీనా తల్లి బబితను కలిసి కరీనాను జీవితాంతం చూసుకుంటానని, ఇద్దరం కలిసి ఉంటామని పర్మిషన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం మొదలు పెట్టారు.

ఇరు కుటుంబాల వారు ఇద్దరి బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో...ఇద్దరు ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశాలకు వెళ్లి ఏకాంతంగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు.

2008లో తొలి సారిగా సైఫ్ అలీఖాన్ కరీనాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. 2010లో మరోసారి స్పందిస్తూ...మరో మూడేళ్లలో తమ పెళ్లి ఉంటుందని మీడియాకు వెల్లడించారు. ఎట్టకేలకు ఈ రోజు సైఫ్-కరీనా ఏకమవ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











