twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బురదలో కత్రినాకైఫ్ ఇలా... (ఫోటో)

    By Srikanya
    |

    ముంబాయి: బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా త్వరలో ఒక కొత్త రూపంలో కనిపించి అలరించనుంది. ఇప్పటివరకు కేవలం గ్లామరస్‌ పాత్రలకే పరిమితమైన ఈ బార్బీ గర్ల్ 'ఫాంటమ్‌' యాక్షన్‌ సినిమాలో వైవిధ్యమైన రూపంలో కనిపించనుంది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైఫ్‌ ఆలీ ఖాన్‌ సరసన నటిస్తున్నారు. ఈ మేరకు ఫోటోలను మీడియాకు విడుదల చేసారు. ఈ ఫోటోలలో కత్రినా,సైఫ్ ఇద్దరూ బురదలో,నల్లటి మసితో ఉండి ఆశ్చర్యపరుస్తున్నారు.

    లెబనాన్‌లో షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమా సెట్స్‌లో కత్రినాకైఫ్ తన విలక్షణమైన రూపంలో ఫొటోలు తీయించుకోటానికి ఆసక్తి చూపిస్తున్నారని కబీర్‌ ఖాన్‌ చెప్పారు. తొలుత సినిమాకి దనియల్‌ ఖాన్‌ అని పేరు నిర్ణయించారు. కానీ కబీర్‌ ఖాన్‌ తుదకు ఫాంటమ్‌ పేరు స్థిరపరిచారు.

    మరో ప్రక్క అమీర్ ఖాన్ హీరోగా త్వరలో రాబోతున్న 'ధూమ్ 3' చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన హాట్ అండ్ సెక్సీ అందాలతో పాటు....సాహస విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఈ చిత్రంలో ఆమె అలియా పాత్రలో నటిస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా కత్రినా కైఫ్ హాట్ పోస్టర్లను విడుదల చేసారు నిర్మాతలు. ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈచిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. . ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌‍ను పురస్కరించుకుని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Katrina Kaif

    ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం. చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

    English summary
    Bollywood actress Katrina Kaif is in action mode, after doing some heavy duty action sequences in Kabir Khan's hit 'Ek Tha Tiger', the actress will be once again seen doing the same in the director's next venture 'Phantom'. The movie will have Saif Ali Khan playing Katrina's love interest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X