అలాంటిదేం లేదని ఖండించిన పూరీ జగన్నాథ్

నితిన్ మాట్లాడుతూ.. ''పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది. సినిమా బాగా వస్తోంది. పాటలు కూడా బాగున్నాయి. పూరి శైలిలో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ప్రేమ కథని సరికొత్తగా తెరపై ఆవిష్కరిస్తున్నారు పూరి. ఇది కచ్చితంగా హ్యాట్రిక్ చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.
అలాగే ఈ చిత్రంలో నితిన్ పికలతో కనిపించనున్నారని తెలుస్తోంది. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది.
విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన హారర్ సినిమా '1920' ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన ఆదాశర్మ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పాటలు: భాస్కరభట్ల, కెమెరా: ఆమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











