Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
పాపం హీరోగారిదే కొట్టేసారు
సాధారణంగా హీరోలు తమ అబిమానుల హృదయాలను దోస్తూంటారు. అయితే బాలీవుడ్ హీరో సయిఫ్ అలీ ఖాన్ కి రివర్స్ లో జరిగింది. త్వరలో రిలీజ్ కానున్న 'లవ్ ఆజ్ కల్' చిత్రం ప్రమోషన్ సందర్భంగా అహ్మదాబాద్ వచ్చిన ఆయన పర్స్ ని దొంగలు కొట్టేసారు. ఈ బాధ చెప్పుకుందామని దర్శకుడు ఇంతియాజ్ అలి(జబ్ వుయ్ మెట్ డైరక్టర్)వంక తిరిగేసరికి అతనూ బిక్కమెహం వేసుకుని ఉన్నాడు. అతని పర్స్ ని కూడా ఆ గుంపులో ఎవరో కొట్టేసారు. అయితే సయిఫ్ మాత్రం దానని పాజిటివ్ గా తీసుకుని తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరో ఈ చేతివాటం చూపించి ఉంటారని కామెంట్ చేసాడు. వారు తమ గుర్తుగా ఈ పర్స్ ని ఉంచుకుంటారంటూ సంతోషపడ్డాడు. అయితే ఇంతియాజ్ అలీ పర్స్ లో మాత్రం అన్నీ ఎటిఎమ్ కార్డులు, డ్రెవింగ్ లైసెన్స్ లు ఉన్నాయి.దాంతో అతను చాలా కంగారుపడుతున్నాడు. మరో ప్రక్క సయిఫ్ ని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రమ్మంటే నా ఫ్యాన్స్ ని అవమానించినట్లుంటుంది అని గుణుగుతున్నాడు.అంతా బాగానే ఉంది గానీ ఇంతకీ సయిఫ్ కి అంత వీరాభిమానులు ఉన్నారా అని చుట్టుప్రక్కలవారు ఆశ్చర్యపోయారు.