హాలీవుడ్ రీమేక్: సైఫ్ అలీ ఖాన్ ‘చెఫ్’ ట్రైలర్
సైఫ్ అలీ ఖాన్ ‘చెఫ్’ మూవీ ట్రైలర్ రిలీజైంది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీకి ఈ చిత్రం రీమేక్.
హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'చెఫ్'ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ హీరోగా, హీరోయిన్ గా పద్మ ప్రియా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధంచిన అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది.
స్టార్ హోటల్లో చెఫ్ గా పని చేస్తూ లక్షల్లో జీతం అందుకుంటున్న ఓ వ్యక్తి తన కలర్ ఫుల్ లైఫ్, హ్యాపీ జీవితం అన్నీ వదులుకొని స్నేహితులతో కలసి రోడ్ సైడ్ ఫుడ్ ట్రక్ ను స్టార్ట్ చేస్తాడు. అందులో అతను తన సంతోషాన్ని ఎలా వెతుక్కున్నాడనేదే చిత్ర కథ.
అక్టోబర్ 6న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి ఒక్కరిని అలరించడమే కాదు సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో సైఫ్ కుమారుడిగా స్వార్ కాంబుల్ నటించాడు.


Click it and Unblock the Notifications











