For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ అవటం సరే గానీ... తెరమీదికి రాకముందే ఈ టైప్ లో పాపులరవుతోంది

  |

  బాలీవుడ్ హీరోల కూతుర్లలో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన వారిలో సారా అలీఖాన్ ఒకరు. లీడింగ్ హీరో సైఫ్ అలీఖాన్, అలనాటి తార అమృతా సింగ్ ల గారాల పట్టి సారా. యుక్తవయసుకు వచ్చిన సారా హీరోయిన్ గా వస్తుందా? తల్లిలా హీరోయిన్ గా మారుతుందా? తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తుందా? అనేది ఒక పెద్ద చర్చనీయాంశమే. శ్రీదేవి తనయ జాన్వీ తర్వాత బాలీవుడ్ మూవీ మేకర్లలో ఆసక్తిని రేపుతున్నది సారా మాత్రమే.

  Saif Ali Khan's daughter Sara chills like a boss with her boyfriend

  పటౌడీల ఫ్యామిలీలో అమ్మాయిలు సినిమాల్లోకి రావడం కొత్తేమీ కాదు. సై సోదరి సోహా అలీఖన్ బాలివుడ్ హీరోయింగా కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే... రెండేళ్ల కిందట తన కూతురు సినిమాల్లోకి రాదని చెప్పిన సైఫ్.. కూతురు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వెల్లడించారు. సారా అలీ ఖాన్ కు తెరంగేట్రం చేయకముందే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. సారాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ లో ఇటీవల చక్కర్లు కొడుతోంది. సారా తన బాయ్ ఫ్రెండ్ వీర్ పహారియాతో రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. ఈ మధ్యనే వీరి వ్యవహారం పత్రికలకెక్కగా... మళ్ళీ ఇంకోసారి జంటగా కనిపించటం హాట్ న్యూస్ అయ్యింది.

  ముంబైలోని ఓ నైట్ క్లబ్ కు బాయ్ ఫ్రెండ్ వీర్ తో కలిసి సారా వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కొన్ని నెలలుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని భిన్న కథనాలు వచ్చాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ మరెవరో కాదు.. మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. వీర్ పహారియా. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వీళ్లు ప్రస్తుతం కలిసే ఉంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వీళ్ల ఫొటోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. హీరోయిన్ గా వస్తుందో లేదో కానీ.. ఈ ప్రేమ కథతో మాత్రం సారా ట్రెండింగ్స్ లోకి వచ్చేసింది!

  అయితే అవి కేవలం కథనాలు మాత్రమే కాదు. ఇద్దరి మధ్యా సీరియస్ రిలేషనే ఉంది ఇద్దరూ చుంబించుకుంటోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న ఇద్దరూ కలిసే అనేక పార్టీలకు హాజరౌతున్నారు. రోడ్లపై ఉండే బండ్లపై వేసే దోశ తినేందుకు తన బాయ్ ఫ్రెండ్ సందేహించడని సారా గర్వంగా చెబుతోంది. వీర్ సున్నిత మనస్కుడని వెల్లడించింది.

  Saif Ali Khan's daughter Sara chills like a boss with her boyfriend

  పాప్ సింగర్ గా కెరీర్ ప్రారంభించాలని భావిస్తోన్న వీర్ తో కలిసి ఆమె డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఈ అమ్మడు సన్నిహితంగా ఉంటోంది. అయితే వీరిద్దరూ ఒకే స్కూలులో చదువుకున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ మూవీ త్వరలో తీయనున్నారని, ఆ మూవీతోనే సారా ఎంట్రీ ఖాయమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సైఫ్, మొదటి భార్య అమృతా సింగ్ కు కుమార్తె సారాతో పాటు కొడుకు ఇబ్రహీమ్ అలీఖాన్ సంతానం. అయితే అమృతతో విడిపోయిన సైఫ్, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

  English summary
  Sara was recently spotted again at a plush Mumbai night club having a great time with her rumoured boyfriend.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X