Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సైఫ్ అలీఖాన్ కూతురు?
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఆయన కూతురు సారా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతోంది. సైఫ్ అలీఖాన్-ఆయన మొదటి భార్య అమృత సింగ్ సంతానమైన సారా త్వరలో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
తల్లి అమృత సింగ్‌తో కలిసి సారా ఇటీవలే...హలో అనే మేగజైన్‌పై తొలిసారిగా దర్శనం ఇచ్చింది. సినిమాల్లో ప్రవేశించడంలో భాగంగా ప్రేక్షకులకు ముఖ పరిచయం కోసం మేగజైన్‌పై ఫోజు ఇచ్చిందని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రముఖ పత్రికతో అమృత సింగ్ మాట్లాడుతూ.....సారా బాలీవుడ్ ఎంట్రీపై క్లూ ఇచ్చారు. ఇప్పటికే ఐదుగురు ఫిల్మ్ మేకర్స్ సారాను తమ సినిమాల్లో హీరోయిన్గా తీసుకోవానికి సంప్రదించారని వెల్లడించింది. ఆమె మాటలను బట్టి త్వరలోనే సారా తారాగా మారడం ఖాయం అని స్పస్టం అవుతోంది.
అయితే మొదటి భార్య అమృత సింగ్‌తో చాలా ఏళ్ల క్రితమే విడిపోయి కరీనా కపూర్‌తో సహజీవనం చేస్తున్న సైఫ్ అలీఖాన్....మొదటి భార్య కూతురును ప్రొత్సహిస్తాడా? లేదా? అనే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇప్పటి వరకు బాలీవుడ్లో వారసులుగా వచ్చిన హీరోయిన్లు నిలదొక్కుకున్న సందర్భాలు చాలా తక్కువే. హేమామాలిని ఇద్దరు కూతుర్లతో పాటు, అనిల్ కపూర్ కూతురు సోనమ్, శిల్పా శెట్టి, కాజోల్ చెల్లెల్లు ఇలా చాలా మంది వారసత్వంతో వచ్చి విఫలం అయ్యారు. సోనాక్షి సిన్హా, శృతి హాసన్ స్టార్ హీరోయిన్లగా మారడానికి తెగ కష్ట పడుతున్నారు. మరి సారా సంగతి ఏమిటో....త్వరలోనే తేలనుంది.