twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సైఫ్ అలీఖాన్ కూతురు?

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఆయన కూతురు సారా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతోంది. సైఫ్ అలీఖాన్-ఆయన మొదటి భార్య అమృత సింగ్ సంతానమైన సారా త్వరలో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

    తల్లి అమృత సింగ్‌తో కలిసి సారా ఇటీవలే...హలో అనే మేగజైన్‌పై తొలిసారిగా దర్శనం ఇచ్చింది. సినిమాల్లో ప్రవేశించడంలో భాగంగా ప్రేక్షకులకు ముఖ పరిచయం కోసం మేగజైన్‌పై ఫోజు ఇచ్చిందని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రముఖ పత్రికతో అమృత సింగ్ మాట్లాడుతూ.....సారా బాలీవుడ్ ఎంట్రీపై క్లూ ఇచ్చారు. ఇప్పటికే ఐదుగురు ఫిల్మ్ మేకర్స్ సారాను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవానికి సంప్రదించారని వెల్లడించింది. ఆమె మాటలను బట్టి త్వరలోనే సారా తారాగా మారడం ఖాయం అని స్పస్టం అవుతోంది.

    అయితే మొదటి భార్య అమృత సింగ్‌తో చాలా ఏళ్ల క్రితమే విడిపోయి కరీనా కపూర్‌తో సహజీవనం చేస్తున్న సైఫ్ అలీఖాన్....మొదటి భార్య కూతురును ప్రొత్సహిస్తాడా? లేదా? అనే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

    అయితే ఇప్పటి వరకు బాలీవుడ్లో వారసులుగా వచ్చిన హీరోయిన్లు నిలదొక్కుకున్న సందర్భాలు చాలా తక్కువే. హేమామాలిని ఇద్దరు కూతుర్లతో పాటు, అనిల్ కపూర్ కూతురు సోనమ్, శిల్పా శెట్టి, కాజోల్ చెల్లెల్లు ఇలా చాలా మంది వారసత్వంతో వచ్చి విఫలం అయ్యారు. సోనాక్షి సిన్హా, శృతి హాసన్ స్టార్ హీరోయిన్లగా మారడానికి తెగ కష్ట పడుతున్నారు. మరి సారా సంగతి ఏమిటో....త్వరలోనే తేలనుంది.

    English summary
    
 Actor Saif Ali Khan has always been in news either for his films or due to his affair with Kareena Kapoor. But, now we are here to take a sneak peak at Saif's family life, that includes his ex-wife Amrita Singh and kids. Saif and Amrita Singh's daughter Sara Ali Khan made her debut on the magazine cover of Hello! magazine along with her mother. This proved as a crucial turning point in young Sara's life, after which the girl has been getting many offers by the Bollywood filmmakers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X