twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నీ బూతులే: సైఫ్ అలీ ఖాన్ మూవీకి 73 సెన్సార్ కట్స్!

    ‘కాలాకాండి’ సినిమాకు సెన్సార్ బోర్డు 73 కట్స్ పెట్టింది. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

    By Bojja Kumar
    |

    ఈ మధ్య సెన్సార్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం అవుతున్నాయి. మొన్న నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన 'బాబుమోషాయ్ బందూక్‌బాజ్' సినిమాకు 48 కట్స్ సూచించడం హాట్ టాపిక్ అయింది. తాజాగా మరో బాలీవుడ్ సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా 73 సీన్లు తొలగించాలని ఆదేశించడం చర్చనీయాంశం అయింది.

    బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కాలాకాండి' విషయంలో సెన్సార్ బోర్డు ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రానికి అక్షత్‌ వర్మ దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

    అన్నీ బూతులే

    అన్నీ బూతులే

    సినిమాకు రికార్డు స్థాయిలో ఇన్ని కట్స్ పెట్టడానికి కారణం సినిమాలో బూతు పదాలు, అసభ్యమైన సన్నివేశాలు ఉండటమే అని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పింది. ఆ సీన్లు తొలగిస్తే తప్ప విడుదలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.

    ఇండియన్ సినీ చరిత్రలో రికార్డు

    ఇండియన్ సినీ చరిత్రలో రికార్డు

    ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి ‘కాలాకాండి' చిత్రానికి రికార్డు స్థాయిలో 73 కట్స్ సూచించి సంచలనం క్రియేట్ చేసింది సెన్సార్ బోర్డు.

    కొత్త చీఫ్ మరింత కఠినమా?

    కొత్త చీఫ్ మరింత కఠినమా?

    ఇంతకు ముందు ‘పహ్లాజ్ నిహ్లానీ' సెన్సార్ బోర్డ్ చీఫ్‌గా ఉన్నారు. ఆయన ఉన్నపుడు చాలా గొడవలు జరిగాయి. చాలా సినిమాలకు ఊహించని స్థాయిలో కట్స్ సూచించారు. ‘బాబుమోషాయ్ బందూక్‌బాజ్' సినిమాకైతే రికార్డు స్థాయిలో 48 కట్స్ సూచించారు. ఇటీవలే సెన్సార్ బోర్డు కొత్త చీఫ్ గా ప్రసూన్ జోషి బాధ్యతలు చేపట్టారు. ఈయన కూడా నిహ్లాని కంటే మరింత కఠినంగా వ్యవహరించడం సినీ వర్గాలకు మింగుడు పడటం లేదు.

    73 సీన్లు పోయాక సినిమా ఏముంటుంది?

    73 సీన్లు పోయాక సినిమా ఏముంటుంది?

    ‘కాలాకాండి' సినిమాలో 73 సీన్లు తీసేశాక చూడటానికి సినిమా ఏముంటుందని బాలీవుడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సినిమాను రియాల్టీకి దగ్గరగా తీయడానికి కొన్ని బూతులు వాడక తప్పదు. సమాజంలో రియల్‌గా జరిగే సంఘటనలే సినిమాలో చూపించాము. అభ్యంతరాలు ఉంటే అడల్ట్ సర్టిఫికెట్ ఇవ్వండి. అంతేకానీ 73 కట్స్ సూచించడం చాలా దారుణమని అంటున్నారు.

    ఢిల్లీ బెల్లీకి బూతులు రాసినోడే

    గతంలో బాలీవుడ్లో వచ్చిన ‘ఢిల్లీ బెల్లీ' అనే సినిమాకు రచయితగా పని చేసిన అక్షత్‌ వర్మ ‘కాలాకాండి' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఢిల్లీ బెల్లి' సినిమాలో అప్పట్లో చాలా బూతులు రాశారు. మా సినిమాలో బూతులు బాగా ఉన్నాయి అని చెప్పి మరీ నిర్మాత అమీర్ ఖాన్ అప్పట్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సెన్సార్ బోర్డు నుండి కూడా అప్పట్లో ఎలాంటి ఇబ్బందు లేవు. మరి ఇపుడు ‘కాలాకాండి' పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

    రివైజింగ్ కమిటీకి

    రివైజింగ్ కమిటీకి

    73 కత్తిరింపులతో సినిమాను రిలీజ్ చేయలేమని నిర్ణయించుకున్న నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్లేందు, అవసరమైన కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 8న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సెన్సార్ గొడవతో విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

    English summary
    Writer Akshat Verma who served up an orgy of profanities in his screenplay of Delhi Belly is back with a new film Kaalakaandi, this time as both writer and director. The Central Board Of Film Certification (CBFC) has reportedly ordered as many as 73 cuts in Kaalakaandi. This staggering number of deletions is a record of sorts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X