సీతను అపహరించడం కరెక్టే.. ‘ఆదిపురుష్’ను వివాదాల్లోకి నెట్టిన సైఫ్ అలీ ఖాన్

ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. చెడుపై మంచి విజయం సాధించడమనే నేపథ్యాన్ని తీసుకుని ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు. ఇక రామాయణం, రాముడు, రావణుడు వంటి వాటిపై మన దేశంలో ఎన్ని కోణాలు, ఎన్ని అభిప్రాయాలున్నాయో అందరికీ తెలిసిందే. రాముడిని దేవుడిగా అందరూ కొలుస్తుంటే.. కొందరు మాత్రం రావణుడిని దేవుడిగా ఆరాధిస్తుంటారు. ఇలా రామాయణంపై ఎన్నో విమర్శలు, ఇంకెన్నో కోణాలున్నాయి.

Recommended Video

Kriti Sanon To Play Sita In Prabhas Starrer Adipurush?
ఎప్పుడూ ఓ చర్చే..

ఎప్పుడూ ఓ చర్చే..

రావణుడు గొప్ప భక్తుడు.. ఎంతో జ్ఞానం కలిగినవాడు.. వేదాలు తెలిసిన వాడు ఎంతో గొప్పవాడంటూ కీర్తిస్తుంటారు. ముఖ్యంగా తమిళనాడు, శ్రీలంక వంటి ప్రాంతాల్లో రావణుడికి గుడులు కట్టి పూజిస్తుంటారు. ఇలా రావణుడిని పొగుడుతూ రాముడిని కించపరిచే వారు కూడా ఉన్నారు. మన దేశంలో ఈ టాపిక్ అనేది ఎప్పుడూ చర్చల్లోకి వస్తూనే ఉంటుంది.

ఆదిపురుష్..

ఆదిపురుష్..


ఒకప్పుడు సినిమాలు ఎలా తీసినా ఏం తీసినా చూపించిన వివాదాలకు దారి తీసేవి కాదు. కానీ ఇప్పుడు మనోభావాలంటూ రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను వివాదాలుగా మలిచి పేరు, డబ్బులు సంపాదించాలనుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఆది పురుష్ కూడా వివాదాల్లో చిక్కుకునేలా ఉంది.

తాజాగా అలా..

తాజాగా అలా..


తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఆదిపురుష్ సినిమా ఎలా ఉండబోతోందని చెప్పాడు. అయితే ఇందులో కొత్త చెప్పడానికి ఏముంటుంది.. రామాయణం అందరికీ తెలిసిందే కదా అనే అనుమానం రావొచ్చు. కానీ ఇక్కడే మనకు సైఫ్ అలీ ఖాన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సినిమాలో రావణుడి పాత్ర తీరు తిన్నులే మార్చేలా కనిపిస్తోంది.. దానికి సైఫ్ చెప్పిన విషయాలే ఉదహరణలుగా ఉన్నాయి.

ఎత్తుకెళ్లడం కరెక్టే..

ఎత్తుకెళ్లడం కరెక్టే..

ఆది పురుష్ సినిమాలో రావణుడిలోని మరో కోణాని, మానవత్వాన్ని చూపించనున్నాం. తన చెల్లి (శూర్పణక)కి జరిగిన అవమానానికి బదులుగా సీతను ఎత్తుకెళ్లడం కరెక్ట్.. అని అనిపించేలా చూపించనున్నామంటూ సైఫ్ అలీ ఖాన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా సైఫ్ మాట్లాడిన మాటలు ఆది పురుష్ సినిమాకు, బిజినెస్‌కు పెద్ద గండి పడేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X