ఆ స్టార్ హీరోతో ‘దృశ్యం’ హిందీ రీమేక్?

By Bojja Kumar

హైదరాబాద్: మలయాళంలో మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం అక్కడ పెద్ద విజయం సాధించగా....తెలుగులో వెంకటేష్ తో రీమేక్ చేస్తే కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో తమిళంలో కమల్ హాసన్ హీరోగా తమిళ రీమేక్ కూడా స్టార్ట్ అయింది. త్వరలో ఈచిత్రం హిందీలో కూడా రీమేక్ కాబోతోంది.

తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న వయోకాం పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతోంది. ఇందులో మోహన్‌లాల్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నట్టు చిత్ర వర్గాల సమాచారం.

Saif Ali Khan to act in Drishyam Hindi Remake

తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X