»   » ఇస్లాంకు వ్యతిరేకంగా సైఫ్-కరీనా మ్యారేజ్!

ఇస్లాంకు వ్యతిరేకంగా సైఫ్-కరీనా మ్యారేజ్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ వివాహం ఇస్లాం వ్యతిరేకమని, ఇస్లాం ప్రకారం వారి వివాహం చెల్లదని ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ ప్రకటించింది. సైఫ్‌తో పెళ్లికి ముందు కరీనా ఇస్లాం మతం స్వీకరించ లేదని, అందు వల్ల వాళ్ల వివాహం ఇస్లాంకు వ్యతిరేకమని, దీన్ని తాము అంగీకరించబోమని ఇస్లామిక్ విద్యాసంస్థలకు చెందిన మత పెద్ద హమీబుర్ రెహ్మాన్ తెలిపారు.

  సైఫ్-కరీనా ఈ నెల 16న ముంబైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. రిజిస్టర్ మ్యారేజ్ సాదా సీదాగా సాగినా.... సంగీత్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలు మాత్రం అంగరంగ వైభవంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన రిసెప్షన్ వేడుకకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, బాలీవుడ్ సినీ స్టార్లు హాజరయ్యారు.

  ప్రధాని మన్మోహన్ వైఫ్ గురుశరణ్ కౌర్, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, రాజీవ్ శుక్లా, జ్యోతిరాధిత్య, సీపీఐ పార్టీకి చెందిన సీతారాం ఏచూరి, బిజేపీ నేత అరుణ్ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ ఆహ్లు వాలియా, రచయిత ప్రసూన్ జోషి, నందితా దాస్...ఇతర బాలీవుడ్ నటీనటులు హారయ్యారు. ఢిల్లీ ఔరంగాబాద్ రోడ్లోని గవర్నమెంట్ బంగ్లాలో రాత్రి 8 గంటలకు ఈ వేడుక ప్రారంభం అయింది.

  సైఫ్- కరీనా లవ్వాయణం వివరాల్లోకి వెళితే... టషన్ చిత్రంతో కలిసి నటించినప్పటి నుంచి సైఫ్-కరీనా బంధం బల పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎఫైర్ రగిలింది. అప్పటి వరకు షాహిద్‌తో ప్రేమాయణం నడిపిన కరీనా అతన్ని వదిలేసి సైఫ్ ప్రేమకు దాసోహం అయింది. అదే విధంగా మొదటి భార్యతో విడాకుల తర్వాత ఒంటరి జీవితం గడుపుతున్న సైఫ్‌కు కరీనాను తన జీవితంలోకి ఎంతో సాదరంగా ఆహ్వానించాడు.

  English summary
  Leading Islamic seminary Darul Uloom Deoband has claimed that Saif Ali Khan's wedding with Kareena Kapoor is anti Islamic as Kareena Kapoor did not convert to Islam before the marriage. The Islamic institution located in Deoband, a town in Saharanpur district of Uttar Pradesh, told TOI, ""Kareena did not convert to Islam before her marriage with Saif. Islam does not approve of such marriages."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more