ఇక.... సైఫ్-కరీనా భార్య భర్తలు
ముంబై: సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ పెళ్లి తంతు ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లో ఇరుకుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్‌గా వీరి మ్యారేజ్ జరిగింది. పెళ్లికి సాక్షులుగా కరీనా తండ్రి రణధీర్ కపూర్, బబితా కపూర్, సైఫ్ తల్లి షర్మిల సంతకాలు చేసారు.
పెళ్లి కోసం కరీనా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ ఆకుపచ్చరంగు సల్వార్, ఎరుపు రంగు దుప్పట్టా ధరించగా, సైప్ బూడిదరంగు షేర్వానీ ధరించారు. వివాహం అనంతరం ఇంటి బయట వేచి ఉన్న అభిమానులకు సైఫ్, కరీనా అభివాదం చేసారు. రేపు ముంబైలోని సిటీ హోటల్‍లో వీరి రిసెప్సన్ జరుగనుంది. 18వ తేదీన ఢిల్లీలో ప్రముఖులకు, స్నేహితులకు విందు ఏర్పాటు చేసారు.
సైఫ్-కరీనా పెళ్లి నేపథ్యంలో.... కరీనా మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ విషెస్ తెలిపారు. ఇన్విటేషన్ అందితే విందు కార్యక్రమానికి హాజరవ్వడానికి కూడా తాను సిద్దమే అని వెల్లడించారు. ఈ వివాహ వేడుకలో సైఫ్ అలీఖాన్ మొదటి భార్య రాక పోయినా...పిల్లలు హాత్రం హాజరైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











