ఆ హీరో చెల్లి అలా...లవ్వరేమో ఇలా! ఎవర్ని నమ్మాలి?
బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్‌ల పెళ్లి వచ్చే సంవత్సరం మార్చిలో జరుగుతుందని సైఫ్ చెల్లెలు సోహా అలీఖాన్ తాజాగా మీడియాకు అందించిన సమాచారం. గతంలో సోహా ఫిబ్రవరిలో జరుగవచ్చేమో అంటూ వ్యాఖ్యానించారు. కానీ తండ్రి పటౌడీ మరణంతో పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అయితే సైఫ్‌తో పెళ్లి 'ఏజెంట్ వినోద్' చిత్రం విడుదల తర్వాతనే ఉంటుందని కరీనా కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. నా పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. నేను డేట్ వెల్లడించే వరకు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే...బాగుండదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కరీనా అక్క కరిష్మా కపూర్ కూడా ఏజెంట్ వినోద్ సినిమా విడుదల తర్వాతే వీళ్ల పెళ్లి ఉంటుందని కన్ ఫర్మ్ చేశారు కూడా. ఈ విధంగా హీరో సైఫ్ చెల్లెలు సోహా ఒక విధంగా...లవ్వర్ కరీనా మరొక విధంగా ప్రకటనలు చేస్తుండటంతో..అసలు ఎవరి మాట నమ్మాలో అర్థం కాక అభిమానులు అయోమయంలో ఉన్నారు.
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏజెంట్ వినోద్' చిత్రాన్ని సైఫ్ సొంతంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2012లో విడుదలయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబవుతోంది.


Click it and Unblock the Notifications











