సైఫ్, కరీనా పెళ్లి డేట్ ఫిక్సయిందా?
ముంబై: బాలీవుడ్ హాట్ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ పెళ్లి డేట్ ఫిక్సయిందట..! అధికారికంగా వారు ప్రకటించకపోయినా బాలీవుడ్ వర్గాలు మాత్రం అక్టోబర్ 17న వారిద్దరూ మనువాడనున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ డేట్‌పై చర్చోపచర్చలు సాగుతున్నాయి. గతంలో అక్టోబర్ 16న అనుకున్నప్పటికీ చివరకు అక్టోబర్ 17ను ఫిక్స్ చేసారని అంటున్నారు.
అక్టోబర్ 17నే వీరు ఎందుకు ఎంచుకున్నారని బాలీవుడ్ జనం ఆరాలు తీస్తున్నారు. ఆ రోజు వరకు సైఫ్, కరీనా చేతుల్లో ఉన్న సినిమాలు పూర్తవుతాయట..! అదీకాక అప్పటికి సైఫ్ తండ్రి నవాబ్ పటౌడీ చనిపోయి ఏడాది కూడా పూర్తవుతుందట..! సో.. అక్టోబర్ 17 నాటికి అన్ని అవాంతరాలు అధిగమించి సైఫ్-కరీనా జంట ఒక ఇంటివారు కానున్నారన్నమాట..!
నాలుగైదేళ్లుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌కు పెళ్లీడుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అలాంటిది ఆయన కరీనాతో పెళ్లికి రెడీ అవుతుండటం... దానికి కరీనా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఓకే చెప్పేయడం విశేషం.
కరీనా నటించిన 'హీరోయిన్' చిత్రం సెప్టెంబర్ 21న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శకుడు మధుర్ బండార్కర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రంలో ఆవిష్కరించనున్నారు. రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











