పెళ్లి ఆలోచన మానుకున్న సైఫ్-కరీనా
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ పెళ్లి ఆలోచన మానుకున్నారు. సైఫ్ తండ్రి, లెజండరీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ హఠాన్మరణం నేపథ్యంలో వాళ్లు ఈ నిర్ణయానికి వచ్చారని సన్నిహితులు అంటున్నారు. వాస్తవానికి ఈ సంవత్సరమే వీరి పెళ్లి జరుగాల్సి ఉన్నప్పటికీ...గత కొన్ని రోజులుగా పటౌడీ అనారోగ్యంగా ఉండటం, సైఫ్ 'ఏజెంట్ వినోద్" చిత్ర దర్శకత్వంలో బిజీగా ఉండటంతో పెళ్లిని వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు.
తాజాగా సైఫ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో దాదాపుగా మరో ఆరు నెలలు, సంవత్సరం వరకు కుటుంబంలో ఎలాంటి సెలబ్రేషన్స్ జరిపే అవకాశం లేదు. సైఫ్ దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ వినోద్ సినిమా కూడా మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా..పటౌడీ భౌతిక ఖాయానికి శుక్రవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్య క్రియల్లో సైఫ్ కుటుంబ సభ్యులు, కరీనా, పలువురు క్రికెట్ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు, మాజీ క్రికెటర్లు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











