వామ్మో...! హీరోగారి ఆస్తి రూ. 750 కోట్లు!
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఆస్తుల విలువ ఇప్పుడు ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ఆయన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ. 750 కోట్లు ఉంటుందని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అయితే ఇదంతా సైఫ్ పూర్వీకుల నుంచి సంక్రమించిందే.
సైఫ్ తండ్రి ప్రముఖ క్రిటర్, పటౌడీ చివరి నవాబ్ మన్సూర్ అలీ ఖాన్. పటౌడీలోలో వీరికి ఆస్తులు బాగానే ఉన్నాయి. పటౌడీలోని వారి ప్యాలెస్, ఇతర ఆస్తులను అన్ని కలిపి లెక్కేయగా రూ. 750 కోట్ల విలువ చేస్తుందని తేలింది. ఈ రేంజిలో ఆస్తులు ఉండటంతో సైఫ్ అలీఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారారు.
ఇటీవల సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్తుల వివరాల గురించి సైఫ్ కుటుంబీకులు చర్చించుకున్నారట. ఈ చర్చల్లో పంపకాల ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 2003లోనే మన్సూర్ అలీఖాన్ ఇద్దరు సోదరీమణులు సలిహా, సబిహా తమ వాటా కోసం పేచీ పెట్టారని, అయితే ఇప్పటి వరకు ఆస్తుల పంపకాల విషయాలు ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది.
తమ కుటుంబ ఆస్తులపై సైఫ్ అలీఖాన్ స్పందిస్తూ...అంతా పిత్రార్జిత ఆస్తి. ఎప్పుడు దాని విలువ గురించి ఆలోచించలేదు...కానీ భారీగానే ఉంటుందని తెలుసు. తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు కాబట్టి అవి లెక్కకట్టలేనివి అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











