తన ప్రియుడే ఆ ప్రకటన చేస్తాడంటున్న కరీనా

గత ఐదేళ్లుగా సైఫ్, కరీనా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము నటిస్తున్న 'ఏజెంట్ వినోద్' చిత్రం విడుదల తర్వాత 2012 ఫిబ్రవరి లేదా మార్చిలో వివాహం చేసుకుంటామని ఆ మధ్య ప్రకటించినా బిజీషెడ్యూల్ వల్ల వివాహం వాయిదా పడింది. ఆ మధ్య సైఫ్ ఫాదర్ టైగర్ పటౌడీ మరణించడం కూడా వీరి వివాహం ఆలస్యం కావడానికి మరో కారణం. అక్టోబర్ 16న పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చినా అది నిజం కాదని తేలింది.
కరీనా కపూర్ ప్రస్తుతం మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో 'హీరోయిన్' చిత్రంలో నటిస్తోంది. రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. సెప్టెంబర్ 21వ తేదీన ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పైకి అందంగా ఒయ్యారాలు ఒలక బోస్తూ కనిపించే బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన మధుర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రంలో ఆవిష్కరించనున్నారు.


Click it and Unblock the Notifications











