'హీరోయిన్' తో నా సినీ కెరీర్ సంతృప్తి నిచ్చింది
పెళ్లి ముహుర్తాన్ని అధికారికంగా సైఫ్ ప్రకటించేంత వరకు ఆగాల్సిందేనని బాలీవుడ్ తార కరీనా కపూర్ అన్నారు. ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సైఫ్, కరీనా పెళ్లి తేదిపై బాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అక్టోబర్ 16 తేదిన పటౌడీ గ్రామంలోని పటౌడీ ప్యాలెస్‌లో పెళ్లి జరుగుతుందని ఇదివరకే సైఫ్ ఆలీ ఖాన్ తల్లి ఒకప్పటి హీరోయిన్ షర్మిలా టాగోర్ ప్రకటించారు.
ఐతే సైఫ్ డిసైడ్ చేసేంత వరకు వేచి చూస్తానని... అప్పటి వరకు తన చిత్రం హిరోయిన్ పై దృష్టి సారిస్తానని, ముంబైలో హీరోయిన్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కరీనా తెలిపింది. ఈ సినిమాకు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. కరీనా కపూర్ సినీ కెరిర్‌లో ఈ చిత్రం పెద్ద హైలెట్ గా నిలవడమే కాకుండా నటిగా తానెంటో నిరూపించుకుంటుందని మధుర్ భండార్కర్ అన్నారు.
హీరోయిన్ అవ్వాలనేది నా డ్రీమ్. ఇప్పటి వరకు నా సినీ కెరిర్ సంతృప్తిగా కొనసాగినప్పటికీ.. మధుర్ భండార్కర్ హీరోయిన్ సినిమా ద్వారా హీరోయిన్‌గా నా జీవితం సార్దకమైందని భావిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు మహి. ఈ సినిమా చూసిన తర్వాత ఈ మహి పాత్ర గురించి మీరంతా గ్యారంటీగా మాట్లాడుకుంటారు. మహి పాత్ర చాలా అసాధరణంగా ఉండి భావోద్వేగంతో కూడుకోని ఉంటుంది.
కరీనా కపూర్‌తో పాటు అర్జున్ రాంపాల్ నటించిన హీరోయిన్ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది. ఇటీవలే పెళ్లి తేదిని ఇంకా డిసైడ్ చేయలేదని.. ఈ సంవత్సరం చివర్లో కరీనాతో పెళ్లి జరగడం మాత్రం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో సైఫ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











