స్టార్ లవ్వర్స్.... పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన చెల్లెమ్మ
బాలీవుడ్ స్టార్ లవర్స్.... సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వీరి వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ సంవత్సరం అక్టోబర్ 16న వీరి వివాహం జరుగనుందని సైఫ్ చెల్లెలు సోహా అలీఖాన్ తన ట్విట్టర్లో పేర్కొంది.
కునాల్ తో ప్రేమాయణం సాగిస్తున్న సోహా....అన్నయ్య పెళ్లి ఎప్పుడు అయిపోతుందా, బాయ్ ఫ్రెండ్‌ను ఎప్పుడు పెళ్లాడుదామా అని ఆతృతగా ఎదురు చూస్తుంది. తాజాగా అనయ్య సైఫ్ పెళ్లి ఖరారు కావడంతో తన ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేస్తూ వారికి విషెష్ తెలిపింది. పటౌడీలో వీరి వివాహం జరుగనుందని వెల్లడించింది.
గత ఐదేళ్లుగా సైఫ్, కరీనా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము నటిస్తున్న 'ఏజెంట్ వినోద్' చిత్రం విడుదల తర్వాత 2012 ఫిబ్రవరి లేదా మార్చిలో వివాహం చేసుకుంటామని ఆ మధ్య ప్రకటించినా బిజీషెడ్యూల్ వల్ల వివాహం వాయిదా పడింది. ఆ మధ్య సైఫ్ ఫాదర్ టైగర్ పటౌడీ మరణించడం కూడా వీరి వివాహం ఆలస్యం కావడానికి మరో కారణం.
41 ఏళ్ల సైఫ్ 1991లో హీరోయిన్ అమృత సింగ్‌ను పెళ్లాడాడు. 13 ఏళ్ల కాపురం తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు పిల్లులు పుట్టిన తర్వాత 2004లో విడాకులు తీసుకున్నారు. కరీనా కూడా గతంలో షాహిద్ కపూర్‌తో మూడేళ్ల పాటు ఘాటైన ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత అతనితో విడిపోయి సైఫ్‌తో బంధం ఏర్పరుచుకుంది.


Click it and Unblock the Notifications











