సింగర్, యాక్టర్ ‘సైగల్’ ఇకలేరు

తెలుగులో సైగల్ సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు, అక్కినేని నాగేశ్వరరావుతో నటించారు. తమిళంలో ఎంజీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్ లతో నటించారు. అదే విధంగా మలయాళంలో సత్యన్, ప్రేమ్ నజీర్, మధు, జయన్, బహదూర్, మమ్ముట్టిలతో కలిసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
కన్నడలో ప్రముఖ నటులు రాజ్ కుమార్, ఉదయ్ కుమార్‌లతో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సైగల్ జోసెఫ్ 12 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలు పెట్టాడు. అనతి కాలంలోనే నటనలో రాణించి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు.
సైగల్ జోసెఫ్ మృతి విషయం తెలుసుకుని మమ్ముట్టి, యూనియన్ మినిస్టర్ కె.వి.థామస్, మినిస్టర్ కె.బాబు, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.కె. అర్జునన్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని సంతాపం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











