'వావ్’ సాయి కుమార్!
ప్రముఖ నటుడు సాయికుమార్ రేపటి నుండి ఈ టీవిలో వావ్ అంటూ యాంకర్ గా కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆ వివరాలను తెలుపడానికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ టీవీ ప్రతినిధి అజయ్ శాంతి, సోనూపిక్స్ పొ్రడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ అధినేత ప్రసాదరావు, సాయి కుమార్, అనిల్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ రేపటి నుండి ప్రైమ్ టైట్ లో వావ్ అనే గేమ్ షో ప్రారంభంకానుంది. ఈ గేమ్ షోలో ముందుగానే పాల్లొనే వారికి లక్షరూపాయల చొప్పున ఇస్తాము. గేమ్ లో వారు ఎవరు ఎంత గెలిస్తే అంత పట్టుకుని పోవచ్చు. ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
అజయ్ శాంతి మాట్లాడుతూ తెలుగు టివి రంగంలో ఒక హీరో మొట్టమొదటి సారిగా యాంకర్ గా కనిపించనున్నారు. ఆయనే సాయికుమార్. తెలుగు వాడై తెలుగును చక్కగా పలకగల వాడిగా డైలాగ్ కింగ్ గా పేరు పొందిన సాయికుమార్ తో చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరు ఎంత ఓడిపోతారు అనే కాన్సెప్ట్ తో ఈ వావ్ రూపొందింది అన్నారు.
సాయి కుమార్ మాట్టాడుతూ ఈ గేమ్ షో వైవిధ్యంగా ఆలోచింప చేసే విధంగా మనసుకు పదును పెట్టే విధంగా ఉంటుంది. ఈ షో ఫస్ట్ ఫెడ్యూల్ పూర్తియింది. చాలా బాగా ఎంజయ్ చేశాము. ఇందులో తొలి ఎపిసోడ్ లో కథానాయకుడు కళ్యాణ్ రామ్ గెస్ట్ గా రానున్నారు. ఈ కార్యక్రమం ఎప్పుడు వస్తుంది అని ఇప్పటికే నన్ను చాలా మంది అడుగుతున్నారు. టి.విల్లో నాకు మైథటాజికల్, హిస్టారికల్ సబ్జెక్ట్ లు చేయాలని ఇష్టం. ఈ టివి వారికి సీతారామరాజు స్ర్కిప్ట్ ఇస్తే వారు ఓకె చేశారు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











