Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగ చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది
Recommended Video
మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'శైలజారెడ్డి అల్లుడు'. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. చైతుకి అత్తగా.. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
అపుడు ‘అల్లరి అల్లుడు'... ఇపుడు ‘శైలజారెడ్డి అల్లుడు'
నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ చిత్రాల్లో ‘అల్లరి అల్లుడు' ఒకటి. ఆ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఆయన తనయుడు నాగ చైతన్య నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం ఉంటుందని భావిస్తున్నారు.
అత్త పాత్రలో రమ్యకృష్ణ
ఒకప్పుడు తెలుగులో అత్త-అల్లుడు సబ్జెక్టుతో వచ్చిన స్టోరీలు బాక్సాఫీసు వద్ద ఓ రేంజిలో పేలాయి. తర్వాత ట్రెండ్ మారడంతో ఇలాంటి కథలతో వచ్చే సినిమాలు తగ్గాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఇలాంటి కాన్సెప్టుతో సినిమా వస్తుండటం, అత్తపాత్రలో పవర్ ఫుల్ గెటప్‌లో రమ్యకృష్ణ నటిస్తుండటం మరింత ప్లస్ అని చెప్పక తప్పదు.
మారుతి సినిమా కావడంతో మరింత హైప్
‘శైలజా రెడ్డి అల్లుడు' చిత్రానికి మారుతి దర్శకత్వం వహంచడం కూడా అంచనాలు మరింత పెంచింది. ఫ్యామిలీ, యూత్ మెచ్చే చిత్రాలు తీసే దర్శకుడిగా మారుతికి మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
ఆగస్ట్ రిలీజ్
శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను ఆగస్ట్ 31న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నెలలోనే చైతు నటించిన సవ్యసాచి మూవీ కూడా రిలీజ్ కానుంది.