శైలజారెడ్డి అల్లుడు టీజర్ వచ్చేది అప్పుడే!
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ఆగష్టు 31 న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, రమ్య కృష్ణ లుక్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి.
తాజగా టీజర్ విడుదల సమయాన్ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. రేపు ఆగష్టు 1 న సాయంత్రం 7:10 గంటలకు టీజర్ విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపి సుందర్ సంగీత అందిస్తున్నారు.

మహానుభావుడు వంటి విజయవంతమైన చిత్రం తరువాత మారుతి నుంచి వస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగ చైతన్య చివరగా నటించిన యుద్ధం శరణం చిత్రం ప్రేక్షకుల ఆకట్టుకోలేకపోయింది. దీనిత కుటుంబ కథ చిత్రంగా వస్తున్న శైలజారెడ్డి అల్లుడు చిత్రం హిట్టు కొట్టడం ఖాయం అనే అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











