సీఎం కావాలనుకున్నా అమ్మ తోడుంటుంది.. HIT దర్శకుడి ట్వీట్ వైరల్
యువ దర్శకులు మొదటి చిత్రంతోనే టాలీవుడ్‌ను ఆకర్షిస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్ కంచెరపాలెం, హిట్ వంటి చిత్రాల దర్శకులు టాలీవుడ్‌ను ఏలేస్తున్నారు. తాజాగా హిట్ దర్శకుడు శైలేష్ కొలనుకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. హిట్ సినిమా టాలీవుడ్‌లో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ సాధించిన సక్సెస్‌ను చూసి బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని భావించారు. అయితే బాలీవుడ్‌లోనూ శైలేష్ కొలను దర్శకుడిగా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇలా ఒక్క సినిమాతోనే దర్శకుడిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడం, బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టడం అతి కొందరికే సాధ్యపడుతోంది. అలా సందీప్ రెడ్డి వంగా లైఫ్‌లోనూ వచ్చింది. ఇక్కడ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ కాగా.. బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌గా దుమ్ముదులిపాడు. ఇక శైలేష్ కొలను సైతం హిట్ రీమేక్‌తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటనున్నాడు. అయితే దీనంతటి వెనుక తన అమ్మ ఉందని తాజాగా చెప్పుకొచ్చాడు.

ఈ మేరకు శైలేష్ కొలను హిట్ సినిమా సెట్ సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఒకనాడు షూటింగ్ జరుగుతుండగా అమ్మ వచ్చిందని తెలిపాడు. నాటి ఫోటోను షేర్ చేస్తూ.. 'మా అమ్మ హిట్ సినిమా సెట్స్‌కు వచ్చింది.. నేను దర్శకుడు కావాలని ఎప్పుడు మా అమ్మతో చెప్పానే అప్పటి నుంచి నా వెన్నంటే ఉంది.. ఒకవేళ నేను సీఎం కావాలని చెప్పినా కూడా నా వెంటే ఉండి ప్రోత్సహించేది.. అమ్మ అద్భుతమైంది కదా'అని ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











