సొంత తమ్ముడితో పూరి జన్నాథ్ ఢీ!
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'తెలుగు తెరపై యముడి నేపథ్యం సక్సెస్‌ఫుల్ ఫార్ములా. తెలుగులో గతంలో వచ్చిన యముడి చిత్రాల కంటే ఈ చిత్రం ఎంతో విభిన్నంగా వుంటుంది. యమధర్మరాజుగా శ్రీహరి, ఆయనకు జతగా చిత్రగుప్తుని పాత్రలో ఎమ్మెస్ నారాయణ ప్రేక్షకుల్ని అలరిస్తారు' అన్నారు. జివికె ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రానికి రచన : వెలిగొండ శ్రీనివాస్, సంగీతం : మహతి, కెమెరా : ప్యాట్రిక్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : వి.ఎస్.మణి, లైన్ ప్రొడ్యూసర్స్ : అమీషా ఎంటర్ టైన్ మెంట్స్.
మరో వైపు పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం కూడా అక్టోబర్ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రం అక్టోబర్ 11 విడుదలవ్వాల్సి ఉండగా 18వ తేదీకి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈచిత్రంలో పవర్ స్టార్ సరసన తమన్నా హీరోయిన్. డీవీవీ దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పూరి జగన్నాథ్, అతని తమ్ముడి సినిమాలో ఒకే నెలలో బాక్సాఫీసు వద్ద ఢీ కొట్టుకోవడం చర్చనీయాంశం అయింది. పూరి-పవన్ సినిమా రేంజి....సాయిరాం శంకర్ నటిస్తున్న సినిమా రేంజి వేర్వేరు అయినా, అసలు పోటీ కాక పోయినా అన్నదమ్ముల బాక్సాఫీసు ఫైట్ ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications












