»   »  నిజం...బికినిలో ఇంతలా రెచ్చిపోయింది ..సాయిధరమ్ తేజ హీరోయిన్ (ఫొటోలు)

నిజం...బికినిలో ఇంతలా రెచ్చిపోయింది ..సాయిధరమ్ తేజ హీరోయిన్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా నేపథ్యమున్న కుటుంబం నుంచి వస్తున్న భామ సయామీ ఖేర్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ సుందరి కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌తో పాపులర్ అయింది. సాయి ధరమ్ తేజ హీరోగా...వైవీఎస్ చౌదరి రూపొందించిన రేయ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

రీసెంట్ గా హిందీలో ఆమె చేసిన మీర్జా సాహిబా చిత్రం నిన్న శుక్రవారం విడుదలై మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఏమనుకుందో ఏమో ఈ వేడిలోనో జనాలకు మరోసారి తన హాట్ ఏంగిల్స్ ని గుర్తు చేయాలనుకుందేమో రెచ్చిపోయింది.

అనిల్‌ కపూర్‌ వారసుడిగా హర్షవర్ధన్‌ 'మీర్జ్యా' చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఇందులో సయామీ ఖేర్‌ హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరూ బాలీవుడ్‌కి కొత్తే కావడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందా అని అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ విడుదలైన సినిమాలో వాళ్ల నటనను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. కెమిస్ట్రీ చక్కగా కుదిరిందంటున్నారు. అది సయామీకి ప్లస్ అయ్యింది.

'మీర్జ్యా రివ్యూ చదువుతూ...సయామీ లెటెస్ట్ హాట్ ఫొటోలు చెక్ చేయండి..

 పంజాబ్ లో ఫేమస్ కథ

పంజాబ్ లో ఫేమస్ కథ

వలల్డ్ వైడ్ గా 'రోమియో-జూలియట్‌'.. 'సలీం-అనార్కలీ' వంటి ప్రేమకథలకు ఎంత పాపులారిటీ ఉందో.. పంజాబ్‌లో 'మీర్జా సాహిబాన్‌' ప్రేమకథకు కూడా అంతే గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ కథను అందరికీ తెలియజేసే ఉద్దేశంతో బాలీవుడ్‌లో 'మీర్జ్యా' చిత్రాన్ని తెరకెక్కించారు.

ube.com/watch?v=7Yru3_H5dQo

 అనీల్ కపూర్ వారసుడుగా..

అనీల్ కపూర్ వారసుడుగా..

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత గుల్జార్‌.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే అనిల్‌కపూర్‌ వారసుడిగా హర్షవర్థన్‌ కపూర్‌ ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లు ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ, 'మీర్జ్యా' .

 అసలేం జరిగింది

అసలేం జరిగింది

కొద్దిరోజుల్లోనే తన చిన్ననాటి స్నేహితుడు మునిష్‌.. పేరు మార్చుకున్నాడని తెలుసుకొని అతని ప్రేమలో పడుతుంది సుచిత్ర. మరి కరణ్‌తో పెళ్లి వద్దని సుచిత్ర.. మునిష్‌తో వెళ్లిపోయిందా? వీళ్లిద్దరి ప్రేమకు పెద్దవాళ్లు అంగీకరించారా? మునిష్‌.. అదిల్‌గా ఎందుకు మారాడు? అసలు మీర్జా-సాహిబాన్‌లకి.. సుచిత్ర-మునిష్‌లకు సంబంధమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్రేమ కావ్యంగా

ప్రేమ కావ్యంగా

'రంగ్‌దే బసంతి'.. 'భాగ్‌ మిల్కా భాగ్‌' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ 'మీర్జ్యా'ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో 'మీర్జా సాహెబా' ప్రేమకథను అందమైన దృశ్యకావ్యంగా మలిచే ప్రయత్నం చేశారు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

 దాంతో పోల్చలేం

దాంతో పోల్చలేం

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత గుల్జార్‌ అందించిన స్క్రీన్‌ప్లే చిత్రానికి అదనపు బలం. డైలాగులు బాగున్నాయి. కానీ 'రోమియో-జూలియట్‌' ప్రేమకథ రేంజ్‌లో దీన్ని చూడలేం. దీని కథ, కథనం వేరే. ఆ కాలంలోకి వెళ్లి చూస్తేనే ఈ కథ గొప్పతనం అర్దమవుతుంది.

 విజువల్ ఎఫెక్ట్స్ ఇంకాస్త

విజువల్ ఎఫెక్ట్స్ ఇంకాస్త

అలాగే ఫస్టాఫ్ కొద్దిగా నిదానంగా,స్లోగా సాగడంతో ప్రేక్షకుడు కొద్దిగా బోర్‌ ఫీలవుతాడు. సినిమాటోగ్రఫీ.. పోరాటఘట్టాలు ఆకట్టుకుంటాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాస్త నిరాశను కలిగిస్తాయి. ఒకటి.. రెండు పాటలు మినహా సంగీతం కూడా ఆసక్తిగా అనిపించదు.

 సయామీ బాగా చేసింది

సయామీ బాగా చేసింది

తొలి చిత్రమే ఇలాంటి భిన్నమైన పాత్రను ఎంచుకున్న హర్షవర్థన్‌కి మంచి మార్కులే పడతాయి. సయామీఖేర్‌ కూడా నటనతో మెప్పించింది. బాలీవుడ్‌లో హర్ష.. సయామీలకు తొలి చిత్రమే అయినా పోటీపడి నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. అనుజ్‌ చౌదరి తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు చేశారు.

 యాడ్ ఫిల్మ్స్ నుంచే

యాడ్ ఫిల్మ్స్ నుంచే

అసలు పేరు: సయామీఖేర్. నాసిక్‌లో పుట్టాను. అక్కడే పెరిగాను, వయసు: 23. అమ్మా నాన్న: నాన్న పేరు అద్వైత్ ఖేర్, అమ్మ పేరు ఉత్తరా మాత్రే ఖేర్. ఇద్దరు మోడల్సే. వందకు పైగా యాడ్ ఫిల్మ్స్‌లో నటించారు. 1983లో మా మదర్ మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. మా నానమ్మ ఉషాకిరణ్, అత్తయ్య షబానా ఆజ్మీ చిత్రపరిశ్రమతో మంచి అనుబంధం వున్నవారే.

 కింగ్ ఫిషర్ క్యాలండర్ లో చూసి

కింగ్ ఫిషర్ క్యాలండర్ లో చూసి

మొదటిసారిగా సయామీ లివీస్ యాడ్‌లో తొలిసారి నటించింది. ఆ తరువాత పాంటలూన్స్, లోరియల్ వంటి వాణిజ్య ప్రకటనలతో పాటు కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్‌లో పాల్గొంది. తొలి సినిమా అవకాశం: కింగ్ ఫిషర్ క్యాలెండర్‌లో నా ఫొటోలు చూసిన దర్శకుడు వైవీఎస్ చౌదరి రేయ్ సినిమాకు కథానాయికగా ఎంపిక చేసుకున్నారు.

సయామీ స్కై డైవింగ్

సయామీ స్కై డైవింగ్

ప్రేమ అనంతమైంది. ఈ అనంత విశ్వంలో ప్రేమ ఓ అద్భుతమైన, అనిర్వచనీయమైన ఓ తీయని అనుభూతి.
ఎవరినైనా ప్రేమించారా: (చిన్నగా నవ్వి) ఇంకా లేదు , జీవితంలో సంతోష క్షణాలు చెప్పాలంటే స్కై డైవింగ్ చేసే క్షణాలంటే నాకు చాలా ఇష్టం.

 టక టకా.. పవన్, రామ్ చరణ్ తో

టక టకా.. పవన్, రామ్ చరణ్ తో

సయామీ టక టకా సమాధానం చెప్పిన కొన్ని ప్రశ్నలు...

ఇష్టమైన తెలుగు హీరో: పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్
ఎవరితో కలిసి నటించాలని వుంది: అమితాబ్ బచ్చన్‌తో.
నటిగా మీ లక్ష్యం: హిందీతో పాటు తెలుగు భాషలోనూ నటిగా రాణించాలని వుంది.
మీకు స్ఫూర్తి ఎవరు: సచిన్ టెండూల్కర్.
ఎప్పుడైనా కలిశారా: రెండు మూడు సార్లు కలిసాను.
ఇష్టమైన సినిమా: ఫర్హాన్ అక్తర్ దిల్ చాహతాహే.
ఇష్టమైన నటీనటులు: టబు, అనిల్ కపూర్, హృతిక్ రోషన్.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు: రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా రూపొందిస్తున్న హిందీ చిత్రం మీర్జా సాహిబాలో నటిస్తున్నాను.
సినిమాల్లోకి రాకుంటే: క్రీడాకారిణిగా రాణించేదాన్ని.

English summary
Saiyami Kher is debuting along with Anil Kapoor's son Harshvardhan Kapoor, in Rakeysh Omprakash Mehra's film, Mirzya. In the film, Saiyami is seen in both traditional and glamorous avatars and we gotta say that her beauty is one of a kind!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu