హిందీలో రీమేక్ కానున్న మరో సూపర్ హిట్ తెలుగు చిత్రం..!?
ప్రభాస్ కథానాయకుడిగా దిల్ రాజ్ నిర్మించిన 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో, ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ హక్కులను తాజాగా ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాద్ వాలా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి హిందీలో ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, దర్శకుడు అనీజ్ బజ్మీతో సాజిద్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
గతంలో పలు ప్రాంతీయ భాషా చిత్రాలను హిందీలోకి రీమేక్ చేసిన అనుభవం అనీజ్ కు వుంది. ఏది ఏమైనా, ఇటీవలి కాలంలో పోకిరీ, కిక్, ఇట్స్ మై లవ్, రెడీ, విక్రమార్కుడు... వంటి పలు తెలుగు చిత్రాలు హిందీలోకి రీమేక్ అయ్యాయి. ఇప్పుడు 'మిస్టర్ పెర్ ఫెక్ట్' కూడా ఆ కోవలో చేరుతోంది.


Click it and Unblock the Notifications











