సీతగా సఖి... ఆదిపురుష్ లో కీర్తి సురేశ్ !
డార్లింగ్ ప్రభాస్ అంత పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక, ఇక జనాలు దాని గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలరు. తానాజీ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ 3D యాక్షన్ డ్రామా ఆదిపురుష్ హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ బాషల్లో తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాలో ఆదిరుపురుషుని అర్థభాగం ఎవరికి ఇవ్వాలా అన్న ఆంశంపై తర్జనభర్జనలు సాగుతున్న నేపథ్యంలో అందరి ఇష్ట "సఖి"నే రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
ఈ పురాణేతిహాసంలో ఆదిపురుషుడిగా ప్రభాస్, శ్రీరామచంద్రుని పాత్రలో కనువిందు చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరడుగుల ఆజానుబాహుని సరసన ఆషామాషీ హీరోయిన్ ను కాకుండా ఏకంగా జూనియర్ మహానటిని పట్టుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మహానటి సినిమాతో జాతీయ పురస్కారం పొందిన కీర్తి సురేశ్ అయితేనే సీత పాత్రకు ప్రాణం పోయగలదని దర్శకుడు ఓమ్ రౌత్ ఆలోచిస్తున్నాడు. ఇక టీ-సిరీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఆదిపురుష్, 400 వందల కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు కీర్తి సురేశ్ కూడా వరుసగా భారీ ప్రాజెక్ట్ లను తన కిట్ లో వేసుకుంటోంది. త్వరలోనే మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాటలో తళుక్కుమనబోతోంది. ఆదిపురుష్ గానీ ఓకే అయితే, తొలిసారి అమ్మడు ప్రభాస్ తో జోడీ కడుతుంది. ఇక ఈ అందాల జంటను చూసేందుకు రెండు కళ్లూ చాలవనడంతో సందేహమేలేదు.


Click it and Unblock the Notifications











