వర్మ ఆమెను వదలలేకే ...'అప్పలరాజు' లోనూ
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం చిత్రంలో హీరోయిన్ గా సాక్షి అనే బాలీవుడ్ భామను సెలెక్టు చేసారు.ఇక ఆమెకిది తొలి అవకాశమేమి కాదు. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కాంటాక్ట్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ఆమెకు బాలీవుడ్ లో గుర్తింపు రాలేదు. మళ్ళీ ఈ చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు వర్మ. ఇక ఈ చిత్రంలో సునీల్..అప్పలరాజుగా...డైరక్టర్ గా కనిపిస్తారు. అతను డైరక్ట్ చేసే అమ్మాయి..ఈ సాక్షి. అంటే సినిమాలో ఆమె నిజ జీవిత పాత్రను చేయనుందన్నమాట. ఇక ఈ చిత్రంలో సునీల్ డైరక్ట్ చేయబోయే సినిమా పేరు నాయకి అని తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ కామిడి కమ్ సెటైర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ ..దాదాపు 12 సంవత్సరాల తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పద్మాలయా స్టూడియోలో జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో అసెస్టెంట్ డైరక్టర్ గా కలర్స్ స్వాతి చేస్తోంది.


Click it and Unblock the Notifications











