ఒక రాత్రికి కోటి ఆఫర్.. నా వీడియోలు చూసి, హాట్ కామెంట్స్ తర్వాత ముఖం చాటేసిన హీరోయిన్!

హాట్ బ్యూటీ సాక్షి చౌదరి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తన కోసం జనాలు ఎంతగా పిచ్చెక్కుతున్నారో వివరిస్తూ సాక్షి చౌదరి ఆ కామెంట్స్ చేసింది. దీనితో సాక్షి చౌదరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. సాక్షి చౌదరి పోటుగాడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సాక్షి అందానికి కుర్రకారు ఫిదా అయినా సరైన విజయం లేకపోడంతో అరా కోరా అవకాశాలతోనే కెరీర్ నెట్టుకొస్తోంది. ప్రస్తుతం సాక్షి చౌదరి నటిస్తున్న సువర్ణ సుందరి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి కనిపించలేదు. దీనికి కారణం ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు.

Recommended Video

Sakshi Said That People are Going Mad After Watching Her Videos | Filmibeat Telugu
ఒక రాత్రికి కోటి ఆఫర్

ఒక రాత్రికి కోటి ఆఫర్

సాక్షి చౌదరి ఇటీవల సోషల్ మీడియాలో.. నా వీడియోలు, ఫోటోలు చూసి జనాలు పిచ్చెక్కిపోతున్నారు. కొంతమంది ఒక రాత్రికి కోటి రూపాయలు ఆఫర్ చేస్తున్నారు. కానీ వాళ్లంతా తెలుసుకోవాల్సింది అమ్మకానికి ఉన్న వస్తువుని కాదు. వెళ్లి నా చిత్రాలు చూసి ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్లు సాక్షి చౌదరిని దుమ్మెత్తి పోస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇంత దిగజారి కామెంట్స్ చేస్తావా అంటూ విమర్శిస్తున్నారు.

 ముఖం చాటేసింది

ముఖం చాటేసింది

ఇటీవల సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటించిన సువర్ణ సుందరి చిత్ర ట్రైలర్ విడుదలైనది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు. ఒక్క సాక్షి తప్ప.ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆమె హాజరు కాకపోతే ఎలా అనే చర్చ జరిగింది. ఇటీవల తాను చేసిన వివాదాస్పద కామెంట్స్ విషయంలో మీడియా నుంచి తప్పకుండా ప్రశ్నలు ఎదురవుతాయని భావించిన సాక్షి ఈ కార్యక్రమానికి ముఖం చాటేసినట్లు తెలుస్తోంది.

గ్లామర్ రోల్స్

గ్లామర్ రోల్స్

సాక్షి చౌదరికి అవకాశాలు తక్కువగా వస్తుండడంతో గ్లామర్ రోల్స్, శృంగార భరిత చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇంస్టాగ్రామ్ లో సాక్షి చౌదరి బికినీ ఫోటోలు యువతని పిచ్చెక్కించేలా ఉంటునాయి. ఊ పే కు హ, మాగ్నెట్ లాంటి రొమాంటిక్ చిత్రాల్లో కూడా సాక్షి నటించింది. ఎన్ని గ్లామర్ ఫీట్లు చేస్తున్నా సాక్షి చౌదరికి గుర్తింపు తీసుకొచ్చే చిత్రం మాత్రం పడడం లేదు. భవిష్యత్తులో ఈ భామకు మంచి విజయం దక్కుతుందేమో చూడాలి. ప్రస్తుతం సాక్షి ఆశలన్నీ సువర్ణ సుందరి పైనే.

 సూపర్ నేచురల్ కథతో

సూపర్ నేచురల్ కథతో

సూపర్ నేచురల్ అంశాలతో దర్శకుడు సూర్య సువర్ణ సుందరి చిత్రాన్ని రూపొందించాడు. విజువల్స్ ఎఫెక్ట్స్ ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. సాక్షి చౌదరి, పూర్ణ, సీనియర్ నటి జయప్రద కీలక పాత్రల్లో నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ వలనే ఈ చిత్ర విడుదల ఆలస్యం అయినట్లు దర్శకుడు సూర్య తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X