హీరోయిన్‌ను ఇబ్బంది పెట్టిన అల్లరి నరేష్ ఫ్యాన్స్
హైదరాబాద్: అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్'. ‘నేను కాదు నా పెళ్లాం'ట్యాగ్ లైన్. సాయి కిషోర్ మచ్చ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత.
‘జేమ్స్ బాండ్' మూవీ ప్రమోషన్లో భాగంగా ఆ చిత్ర హీరో అల్లరి నరేష్, సాక్షి చౌదరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తుని, కాకినాడ, రాజమండ్రి, తనుకు, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సక్సెస్ టూర్ సాగింది.

టూర్ కోసం భారీగా ఏర్పాట్లు చేసిన నిర్మాతలు.... హీరోయిన్ ఇబ్బంది పడకుండా చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేయలేదట. దీంతో ఆమె వెళ్లిన ప్రతి చోటా అల్లరి నరేష్ అభిమానుల మూలంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పలువురు ఫ్యాన్స్ ఆమెను టచ్ చేయడానికి పోటీ పడ్డారు. బౌన్సర్లు లేక పోవడంతో ఆమె వారి మూలంగా చాలా ఇబ్బంది పడినట్లు సమాచారం.
పక్కన అల్లరి నరేష్ ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోయాడని టాక్. అలా ఇబ్బంది పడుతూనే సినిమా ప్రమోషన్లలో పాల్గొంది సాక్షి చౌదరి. పాపం... పాప ఎంత కష్టపడింది.


Click it and Unblock the Notifications











