మెగా‘స్టార్ హీరోయిన్’ స్పెషల్ సాంగ్...!
చిరంజీవితో 'మాస్టర్", 'ఇద్దరు మిత్రుల", నాగార్జునతో 'సీతారామరాజు", మహేష్ బాబుతో 'యువరాజు" వంటి చిత్రాల్లో నటించిన సాక్షి శివానంద్ కి తెలుగులో పెద్ద సంఖ్యలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆమధ్య 'హోమం", ఈ మధ్య 'రంగ ది దొంగ"లో ఆమెతో స్పెషల్ సాంగ్స్ చేయించారు. ఇప్పుడు తాజాగా తమిళంలో 'ఆది భగవాన్" అనే చిత్రంలో సాక్షి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది.
దక్షిణాది భాషా చిత్రాలన్నిట్లో నటించడంతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించిన సాక్షి శివానంద్ పెళ్లి అనంతరం సినిమాలకు కామా చెప్పింది. పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కొంచెం అటు ఇటుగా సెకండ్ ఇన్నింగ్స్ చేయడం కామనే కాబట్టి..సాక్షి కూడా ఓ స్పెషల్ సాంగ్ తో తమిళంలోకి రీఎంట్రీ ఇస్తున్నది. పదేళ్ల క్రితమే సినిమారంగ ప్రవేశం చేసిన సాక్షి..తన ఫిజిక్ ను మెయింటైన్ చేయడంలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే పిల్లల తల్లి అయ్యాక కూడా రమ్యకృష్ణ తరహాలో ఐటం సాంగ్ చేసే అవకాశం సొంతం చేసుకుంది.
హీరోల్ని పక్కన పెడితే..దర్శకుల్లో వైవియస్ చౌదరి..సాక్షికి వీరాభిమాని అని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. కాబట్టి..చిరంజీవి మేనల్లుడ్ని హీరోగా పరిచయం చేస్తూ తను రూపొందిస్తున్న 'రేయ్"లో సాక్షితో ఐటం సాంగ్ చేయిస్తాడేమో చూడాలి..


Click it and Unblock the Notifications











