twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ పై 'సాక్షి' మరోసారి

    By Srikanya
    |

    హైదరాబాద్: గతంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వ్యంగ్య పూరిత బాణాలు విసిరిన 'సాక్షి' మరోసారి పవన్ ని ఉద్దేశించి ఓ ఆర్టికల్ ప్రచురించింది. 'ప్రశ్నిస్తానన్నాడు...పత్తా లేకుండా పోయాడు ' అంటూ పవన్ ...సామాన్యుడుకి రైలు ఛార్జీల రూపంలో రైతు రుణ మాఫి అమలు కాకపోయిన అంశంలో...అన్యాయం జరిగినా నిలదీయటానికి రావటం లేదేంటి అంటూ ప్రశ్నించింది. సాక్షి లో ప్రచరించిన ఆర్టికల్...(యధాతథంగా)

    తనది సామాన్యుడు పక్షం...రాజకీయ నాయకులను నిలదీయడమే తన పని...పాలించడానికి కాదు ప్రశ్నించడానికే పార్టీ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సేన పార్టీతో వాయుసేనకు చెందిన యుద్ద విమానంలా ఎన్నికల ముందు దూసుకువచ్చాడు. బీజేపీ, టీడిపి పొత్తుకు ఓటేయండండూ రాష్ట్రమంతా ప్రచారం చేసాడు. సామాన్యుడుకి అన్యాయం జరిగితే బీజేపి, టిడీపీల నైనా నిలదీస్తానంటూ ప్రజలకు భరోసా ఇచ్చాడు.

    భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి చేపట్టిన నెలరోజుల లోపే రైల్వే ఛార్జీలు ఎన్నడూ లేనంతగా 14.2 శాతం పెరిగాయి. డీజిల్, పెట్రోల్, గృహ నిర్మాణం సామగ్రి, సిమెంట్, ఉక్కు తదితర వస్తువుల ధరలు ఆకాశానంటాయి. దాంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని స్దితి. కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. వంట గ్యాస్ ధర త్వరలో రెండు వందల యాభై వరకూ పెరగబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

    Sakshi wrote an article item on Pawan Klayan

    మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు భాధ్యతలు స్వీకరించి నెల గడిచింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణ మాఫీ దస్త్రంపై తొలి సంతకం చేస్తానంటూ ఎన్నికలు నేపధ్యంలో చంద్రబాబు హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు. నేడో రేపో రుణ మాఫీ చేస్తాడంటూ రైతులు కళ్ళలో ఒత్తులు వేసి ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పదివి విమరణ వయస్సు 58 నుంచి 60 పెంచారు. దాంతో తమకు ఉద్యోగాలు రావంటూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటికో ఉద్యోగం ప్రకటించిన బాబు ఇప్పటివరకూ ఉద్యోగ ప్రకటన చేయకపోవటంతో నిరుద్యోగులు తీవ్ర వేదనతో ఉన్నారు.

    ఇంతమంది ఇన్ని విధాల బాధపడుతూంటే సామాన్య ప్రజల కోసమే పోరాటం...వారి కోసం జైలు ఊచలు లెక్కించటానికైనా చివరకి మరణానికైనా సిద్దమని ఎన్నికల చెప్పిన ఈ ఆరుడుగల బుల్లెట్ సదరు నేతలను ప్రశ్నించడం లేదంటే అవి సమస్యలు కాదనుకున్నాడేమో. ఎన్నికల్లో బీజేపీ,టీడీపీల విజయకేతనం ఎగవేయడంతో ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ప్రకటించిన పవన్ కళ్యాణ్...ప్రజల సమస్యలను అటు ప్రధాని మోడీ, ఇటు చంద్రబాబుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పిన విషయాన్ని ఏదో కథలో చెప్పినట్లు మునిశాపం వల్ల మర్చిపోయి ఉండవచ్చని సామాన్యుడు నుంచి రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటన్నారు అంటూ రాసుకొచ్చింది. మరి ఈ విషయమై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

    సినిమాల విషయానికి వస్తే...

    ఓ మై గాడ్ రీమేక్ 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అనుకున్న దాని ప్రకారం ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలి. కానీ ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఎందుకంటే పవన్ తన పాత్ర విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్ర వెంకటేష్, మిగతా నటీనటులపై వచ్చే సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

    గోపాల గోపాల చిత్రంలతో తాను చేయబోయే కృష్ణుడు పాత్ర లోతుల్లోకి వెళ్లటానికి పవన్ ఇప్పుడు మళ్లీ రాత్రింబవళ్లు అవే ఆలోచనలతో గడుపుతున్నారని సమాచారం. అందుకోసం ఆధ్యాత్మక సంభంధ పుస్తకాలు రిఫెర్ చెయ్యడం వంటివి చేస్తున్నారని అంటున్నారు. పాత్ర ఎక్కడా విమర్శలకు లోను కాకూడదని దర్శకుడుకి గట్టిగా చెప్పారని వినపడుతోంది.

    English summary
    
 Sakshi wrote an article about Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X