Salaar Postpone: సలార్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన.. అర్థం చేసుకోండి అంటూ!

తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోయింది. అందుకు చాలా మంది హీరోలు కారణం అయ్యారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సి పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌దే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా అతడు తనదైన చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూనే వెళ్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తోన్న చిత్రమే 'సలార్ - సీజ్‌ఫైర్'. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మూవీ రిలీజ్‌పై అనుమానాలు వచ్చాయి.

Salaar Movie Team Official Announcement on Release Postpone

వాస్తవానికి 'సలార్' మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే, ఉన్నట్లుండి ఈ సినిమా బుకింగ్స్ ఆగిపోవడంతో ఇది వాయిదా పడుతుందన్న టాక్ మొదలైంది. అదే సమయంలో ఎన్నో చిత్రాలు సెప్టెంబర్ 28కి వాయిదా పడ్డాయి.

'సలార్' మూవీ వాయిదా కన్ఫార్మ్ అయినా చిత్ర యూనిట్ మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆశను పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా నిర్మాణ సంస్థ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌ ఖాతాలో ఓ ప్రకటనను వదిలింది. ఇందులో అనుకోని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

హొంబళే సంస్థ ట్విట్టర్ ఖాతాలో 'సలార్ మూవీకి మద్దతు ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మేము సలార్ మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలి. కానీ అనుకోని కారణాల వల్ల దీన్ని వాయిదా వేస్తున్నాము. మీకు అసాధారణమైన అనుభవాన్ని అందించాలన్న దానికి కట్టుబడి ఉన్నాము. అందుకోసం మా యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌ను నిర్ణీత సమయంలో ప్రకటిస్తాము. దయచేసి మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామో అర్థం చేసుకోండి. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం అయినందుకు ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చింది.

Salaar Movie Team Official Announcement on Release Postpone

ఇదిలా ఉండగా.. 'సలార్' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X