Salaar Trailer Review: మోస్ట్ వైలెంట్‌గా సలార్ ట్రైలర్.. పవర్‌ఫుల్‌గా ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో తాజాగా రాబోతున్న చిత్రం సలార్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కోసం తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు ప్రభాస్, ఇటు ప్రశాంత్ నీల్ అభిమానులు. అయితే ఇటీవలే ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈక్రమంలోనే చిత్ర బృందం తాజాగా సలార్ ట్రైలర్ ను విడుదల చేసింది.

దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ నిజంగా అదిరిపోయింది. అద్భుతమైన యాక్షన్ సీన్లలో ప్రభాస్ అదిరిపోయాడు. ఆయన స్నేహితుడి కోసం ప్రభాస్ ఓ ఆర్మీగా నిలబడబోతున్నట్లు ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. ముఖ్యంగా స్నేహితుడి కోసం ఎంతకు అయినా తెగించే పాత్రలో యంగ్ రెబల్ స్టార్ యాక్టింగ్ ఇరగదీశాడు. అసలు ఈ ట్రైలర్ లో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Salaar Part I Ceasefire Trailer review: Prashanth Neel magic with Prabhas

ట్రైలర్ ప్రారంభం అవడమే... ఇద్దరు స్నేహితులను కనిపిస్తారు. అందులో ఒకరు ప్రభాస్, మరొకరు ఆయన స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్. చిన్నప్పటి పాత్రల్లో వీరు ఉండగా.. తన స్నేహితుడిని ఎవరో ఏదో అన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ప్రభాస్ అతడి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ.. ఎవడాడు, ఎవడు అంటూ గట్టిగా అడుగుతుండగా.. స్నేహితుడు మాత్రం భయంతో ఏడుస్తూ వద్దురా దేవ వద్దు అంటూ కనిపిస్తాడు. ఇది చూస్తుంటే ప్రభాస్ పేరు ఈ సినిమాలో దేవ అని అర్థం అవుతుంది.

స్నేహితుడి కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతానంటూ చిన్నప్పటి ప్రభాస్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఫ్రెండ్ పిలిస్తే అతడి కోసం మళ్లీ ఇక్కడికి వస్తానంటూ చెప్పడం తెగ ఆకట్టుకుంటోంది. ఖాన్ సార్ అడవిలో ఏర్పడ్డ సామ్రాజ్యం ఆధిపత్యం కోసమే ఈ సినిమా సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆ స్థానం కోసం ప్రాణాలకు తెగించగా... ప్రభాస్ స్నేహితుడు కోసం దాని కోసం పోటీ పడతాడు. అయితే దాన్ని దక్కించుకోలేకపోతాడు. ఆ తర్వాత నారంగ్ రష్యా వాళ్లను, కురుంగ్ వాళ్లు సెర్బియన్ ఆర్మీని తెచ్చుకున్నారు.. మనం ఎవరిని తెచ్చుకుందామని ప్రభాస్ స్నేహితుడిని ఆయన అనుచరుచులు అడగుతూ కనిపిస్తారు.

మన ఆర్మీ ఎవరు అంటూ ప్రశ్నించగా.. అదిరిపోయే లుక్ లో ప్రభాస్ కనిపించాడు. తన స్నేహితుడిని ఖాన్ సార్ అధిష్టానంపై చూసేందుకు ప్రభాస్ యే అతడి ఆర్మీగా మారి ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ కు ఆయన స్నేహితుడు నా కళ్ల ముందు కనిపిస్తున్నదంతా నాక్కావాలని అని చెప్పడం, మన బ్లెడ్ లోనే వైలెన్స్ ఉందంటూ జగ్గూభాయ్ చెప్పడం కడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇఖ శృతి హాసన్ అయితే భయంగా కనిపిస్తోంది.

ఇదంతా ఇలా ఉండగా.. ఓవైపు ఫుల్ మాస్ గా కనిపిస్తూ రక్తాలు వచ్చేలా కొడుతూనే.. ప్లీజ్.. ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంటూ బతిమాలుతున్న ప్రభాస్ ను చూస్తుంటే.. ఆయన అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి... లోపలికి ఎవడొస్తాడని కాదు ఎవరూ రాకూడదని అంటూ చెప్పే డైలాగ్ కూడా అదిరిపోయింది. ట్రైలర్ యే ఈ రేంజ్ లో ఉంటే మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X