Salaar తెలంగాణలో సలార్ టికెట్ రేట్ల వివాదం.. 120 జీవోను రద్దు చేయండి.. రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్!

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందిన సలార్ చిత్రం అట్టహాసంగా రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు హంగామా మొదలైంది. అయితే ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకొనేలా అనుమతి ఇవ్వమంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను చిత్ర యూనిట్ చర్చలు జరుపుతుందనే విషయంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ టికెట్ల రేట్ల పెంపు వివరాల్లోకి వెళితే..

సలార్ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన నేపథ్యంలో ఈ మూవీకి టికెట్ రేట్లు పెంచాలని ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలను కోరినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల్లోను మల్టీప్లెక్స్‌లో 450 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లో 250 ఉండేలా అనుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది.

Salaar Ticket rates hike Contraversy: Natti Kumar demands scrap of GO 120 before Prabhas movie Release

అయితే సలార్ మూవీకి టికెట్ రేట్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలపై చిన్న నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మల్టీ ప్లెక్స్‌లో ప్రదర్శించే సినిమాలకు 450 రూపాయలు పడితే.. చిన్న సినిమాలను ఎవరు చూస్తారు? దాని వల్ల చిన్న సినిమాలను చంపివేయడమే జరుగుతుందని వారు తమ వాదనను వినిపిస్తున్నారు.

Salaar Ticket rates hike Contraversy: Natti Kumar demands scrap of GO 120 before Prabhas movie Release

అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన 120 జీవోను రద్దు చేయాలని చిన్న నిర్మాతలు తాజా కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డికి విన్నవించుకొంటున్నారు. 120 జీవో ప్రకారం పరిస్థితులను బట్టి రాష్ట్రమంతటా టికెట్ రేట్లను పెంచుకొనేందుకు ప్రభుత్వం వెసులుబాటును కలిగిస్తూ జీవోను జారీ చేసింది.

Salaar Ticket rates hike Contraversy: Natti Kumar demands scrap of GO 120 before Prabhas movie Release

టికెట్ల రేట్ల పెంపుపై అడ్వకేట్ జీఎల్ నరసింహారావు దాఖలు చేసిన పిల్ నేపథ్యంలో 120 జీవో కాపీని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనానికి అందజేసింది. సినిమా టికెట్ రేట్ల పెంచుకొనే విధంగా జీవో 75ను సవరించి చేసి 120 జీవోను జారీ చేసినట్టు ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

సలార్ టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై చిన్న నిర్మాతల సంఘం తరుఫున నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. సినిమా పరిశ్రమకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ గతంలో నేల టికెట్‌ను ప్రవేశపెట్టారు. పేదవాడు తక్కువ రేటుకు సినిమా చేస్తే చిన్న నిర్మాతకు మేలు జరుగుతుంది. సలార్ సినిమా టికెట్ మల్టీప్లెక్స్‌లో 200 రూపాయలు దాటకూడదు, సింగిల్ స్క్రీన్ 100 రూపాయలకు మించి ఉండకూడదు. 120 జీవోను రద్దు చేయండి అని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X