ప్రభాస్ విషయంలో ఆ వార్తలన్నీ అబద్దమే.. ఒక్క ఫొటోతో రూమర్స్‌కు చెక్!
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ సినిమా అంటే అది వందల కోట్ల రూపాయల మేర బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆయన చేసిన సాహో సినిమా, తాజాగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా రెండూ ఇబ్బంది పెట్టాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతానికి కేజిఎఫ్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ లుక్ విషయంలో ఏ మాత్రం సంతోషంగా లేరని ప్రచారం జరిగింది.
తాను అనుకున్న లుక్కు వేరు, కానీ ప్రభాస్ ప్రస్తుతం ఉన్న లుక్కు వేరుగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారని అంటూ ప్రచారం సాగింది. మొహమాటానికి పోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని భావించి లుక్ మారే వరకు షూటింగ్ చేసేది లేదు అని ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ తేల్చి చెప్పినట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే అటువంటి వార్తలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు సలార్ మేకర్స్. అదేమిటి అంటే తాజాగా 'సలార్' సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ సెట్స్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను ప్రభాస్ కౌగిలించుకున్న ఫొటోను సినిమా యూనిట్ ట్వీట్ చేసింది. అంటే సినిమా ఆగలేదని నిరాటంకంగా సాగుతోందని చెప్పినట్టు అయింది.

అయితే ప్రభాస్ లుక్ విషయంలో కొద్ది రోజుల క్రితం ట్రోల్స్ కూడా నడిచిన సంగతి తెలిసిందే. ఆయన ముంబైలో కారులో వెళుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు బయటకు వచ్చాక పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.. అయితే రాధేశ్యామ్ సినిమాలో మాత్రం ఆయన చాలా స్లిమ్ గా కనిపించాడు. ప్రభాస్ తో సినిమా చేస్తున్న వారు ఆయనను గ్రాఫిక్స్ లో సన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పర్ఫెక్షన్ విషయంలో రాజమౌళికి ఏమాత్రం తీసిపోని ప్రశాంత్ తాను అలా చేయడానికి విరుద్ధం అని, మీరు పూర్తిగా సన్నబడిన తరువాతే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని ప్రభాస్ కు చెప్పినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు సినిమా షూట్ మొదలైన విషయంలో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











