లక్ష్మీప్రసన్న మూవీస్ బ్యానర్ పై డా.మోహన్ బాబు నిర్మించతలపెట్టిన చిత్రం 'సలీం..దుమ్మురేపుతాడు'.ఈ సినిమా ఆగస్టు 14న సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది. వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మోహన్ బాబు,విష్ణువర్ధన్ బాబు ప్రధానపాత్రలను పోషించనున్నారు.ఢీ సినిమాతో ఫ్లాపుల పరంపరనుండి తప్పించుకున్న విష్ణు కృష్ణార్జున తో కొంత డీలా పడ్డాడు.అలాగే ఒక్క మగాడు భారీ పరాజయంతో అందరి విమర్శలు ఎదుర్కొన్న చౌదరి ఈ సినిమాతో మళ్ళీ పూర్తి స్ధాయిలో లైమ్ లైట్ లోకి రావాలని ఆశిస్తున్నారు. అలాగే ఈ సినిమా స్క్రిప్టు పూర్తి గా ఎంటర్టైన్ మెంటుతో నిండి ఉంటుందని,'దేవదాస్' రేంజిలో హిట్టవుతుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.