ఫ్లాప్ కాంబినేషన్ లో వస్తున్న 'సలీం'
మంచు విష్ణువర్ధన్, ఇలియానాల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'సలీం'. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై.వి.యస్.చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది దర్శకుడు వై.వి.యస్.చౌదరికి 50వ చిత్రం.
ప్రస్తుతం రామోజీఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయనో డాన్ గా కనిపిస్తారని విశ్వసనీయ సమాచారం. విష్ణు, మోహన్ బాబు కలిసి ఇంతకు ముందు 'గేమ్' సినిమాలో నటించినా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. వై.వి.యస్.చౌదరి 'ఒక్కమగాడు' చిత్ర ఘోరపరాజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే...
ఇలా ఫ్లాప్ కాంబినేషన్ వస్తున్న ఈ చిత్రం కోసం అందరూ చాలా కసిగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసమే విష్ణు చాలా స్లిమ్ గా తయారయ్యాడు. ఇలియానా కూడా గ్లామర్ తో పాటు నటనకు అవకాశం వున్న పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. ఇక మోహన్ బాబు వైవిధ్యమైన నటన ఈ సినిమాకే హైలెట్ గా వుంటుందట. త్వరలోనే ఆడియోను విడుదల చెయ్యబోతున్న ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











