మంచు విష్ణు 'సలీం' కు అక్కడా అంత మార్కెట్?
మంచు విష్ణు,వైవియస్ చౌదరి కాంబినేషన్లో రెడీ అయిన సలీం(దుమ్ము రేపుతాడు) చిత్రం మహారాష్ట్రలో 35 ధియోటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇదీ ఓ పెద్ద రికార్డే. ఎందుకంటే తెలుగు సినిమా ఏదీ అక్కడ అన్ని సెంటర్లలో రిలీజ్ కాలేదు. దానికి కారణంగా అక్కడ మోహన్ బాబుకు మంచి క్రేజ్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మోహన్ బాబు..ఆ మధ్య సుశీల్ కుమార్ షిండేకు అక్కడకు వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. గత పాతికేళ్ళుగా సుశీల్ కుమార్ షిండే, మోహన్ బాబు మంచి స్నేహితులు. అలాగే డిల్లీలో ఐదు ధియోటర్స్ లో రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 11న ఈ భారీ రిలీజ్ జరగనుంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు చిత్రం ఈ రేంజిలో నేషనల్ మార్కెట్లో రిలీజ్ కాకపోవటంతో అంతటా చర్చనీయాంశమైంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ పై సంయుక్తంగా నిర్మించారు. ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. దేవదాసు అనంతరం వైవియస్ దర్శకత్వంలో ఇలియానా చేస్తోంది. అలాగే మోహన్ బాబు ఈ చిత్రంలో కామిడీ విలన్ గా ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











