నటుడు సలీల్ అంకోలా మాజీ భార్య ఆత్మహత్య

పరిణీత, అంకోలా 2011లో విడాకులు తీసుకున్నారు. వారికి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. ఆదివారం సాయంత్రం పరిణీత తల్లి బయటకు వెళ్లారని, తిరిగి రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చారని, ఇంటి తలుపులు మూసి ఉండడాన్ని ఆమె చూశారని, ఏదో జరిగిందనే భయంతో ఆమె ఇరుగుపొరుగువారిని పిలిచారని, పోలీసులకు సమాచారం ఇచ్చారని పోలీసులు చెప్పారు.
పరిణీత గదిలో ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను ససూన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదని పోలీసులు చెప్పారు.


Click it and Unblock the Notifications











