సల్మాన్‌ఖాన్‌ను కాటు వేసిన పాము పట్టివేత… దాన్ని ఏం చేశామో? ఏం జరిగిందో వెల్లడించిన సలీంఖాన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక పాము కాటుకు గురయ్యారు. శనివారం రాత్రి తన పన్వెల్ ఫామ్ హౌస్‌లో సల్మాన్‌ను పాము కాటు వేసినట్లు సమాచారం. పాము కాటుకు గురైన వెంటనే, సల్మాన్ ఖాన్ మధ్యాహ్నం 3 గంటలకు ఆసుపత్రిలో చేరాడు. పాము విషపూరితం కానప్పటికీ, ప్రథమ చికిత్స తర్వాత, సల్మాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ పాము కాటు కు సంబంధించి సల్మాన్ తండ్రి కీలక వివరాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

పుట్టినరోజును జరుపుకోవడానికి
నివేదికల ప్రకారం, సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజును జరుపుకోవడానికి పన్వెల్ ఫామ్ హౌస్‌కు చేరుకున్నాడు. సల్మాన్ ఖాన్ తన 56వ పుట్టినరోజు 27 డిసెంబర్ 2021 న జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, సల్మాన్ క్రిస్మస్, తన పుట్టినరోజు మరియు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి కుటుంబం మరియు సన్నిహితులతో కలిసి తన పన్వెల్ ఫామ్ హౌస్ కు చేరారు.

ప్రమాదం ఏమీ లేదు
ఈ ఏడాది కూడా బాలీవుడ్ తారలు, నిర్మాతలు, ఇతర స్నేహితులు పుట్టినరోజు వేడుకలకు పన్వేల్‌లో ఇప్పటికే వచ్చి చేరారు. సల్మాన్ స్నేహితులు చాలా మంది ఈ మధ్యాహ్నం పన్వెల్ చేరుకుంటారని అనుకున్నారు. ఈ సమయంలో సల్మాన్ పాము కాటు వార్త విని అతని అభిమానులు కూడా ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదం ఏమీ లేదని, సల్మాన్ ఆరోగ్యం క్షేమంగా ఉందని సమాచారం.

ముందు భయపడ్డాం, కానీ
పన్వెల్‌లో సల్మాన్ ఫామ్‌హౌస్ ఉన్న ప్రాంతం అటవీ ప్రాంతం. పాములు, కొండచిలువలు సహా అన్ని వన్యప్రాణులు ఉండటం సహజం. ఈ విషయంపై, సల్మాన్ తండ్రి సలీం ఖాన్ మాట్లాడుతూ, 'సల్మాన్‌ను ఇంజెక్షన్ కోసం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు, మేము ముందు భయపడ్డాం, కానీ అదృష్టవశాత్తూ పాము విషపూరితమైనది కాదని తేలింది. ఇంకా అడిగినప్పుడు, సలీం ఖాన్, 'సల్మాన్ తన ఫామ్ హౌస్‌కి తిరిగి వచ్చి కొన్ని గంటలు పడుకున్నాడు. ఇప్పుడు బాగానే ఉంది మరియు చింతించాల్సిన పని లేదు అన్నారు.

తిరిగి అడవిలోకి విడిచిపెట్టారు
కానీ అవును, నేను భయపడ్డానని ఆయన అన్నారు. ఫామ్‌హౌస్‌లోని సిబ్బందిని కూడా చాలాసార్లు పాములు, తేళ్లు కాటేశాయని సలీం ఖాన్ చెప్పారు. అయితే, ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న అడవిలో చాలా పాములు విషపూరితమైనవి కావన్నారు ఆయన. సలీం ఖాన్ మాట్లాడుతూ, 'సల్మాన్‌ను పాము కాటువేసినప్పుడు మా సిబ్బంది ఆ పామును పట్టుకున్నారు. విషం లేని పాములను చంపవద్దని చెప్పాం. సల్మాన్‌ను కాటు వేసిన పాము విషపూరితమైనది కాదని తెలియడంతో, తిరిగి అడవిలోకి విడిచిపెట్టారని, ఫామ్‌హౌస్‌కి కాస్త దూరంగా ఉన్న అడవిలో వదిలేశారని అన్నారు.

అంతిమ్ సినిమా కోసం
సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 27 మరియు న్యూ ఇయర్ నాడు తన పుట్టినరోజును జరుపుకోవడానికి తన పన్వెల్ ఫామ్ హౌస్‌కి వెళతార. కరోనా వైరస్ యొక్క కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది, కాబట్టి ఈ సంవత్సరం పార్టీకి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని అంటున్నారు. సినిమాల విషయానికి వస్తే ఆయన అంతిమ్ సినిమా కోసం సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











